Kedarnath Opening Date 2025 : కేదార్‌నాథ్‌ తలుపులు తెరుచుకునేది ఎప్పుడో తెలుసా? ఎలా బుక్ చేసుకోవాలి? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

Kedarnath Opening Date 2025 : కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు త్వరలో తెరుచుకోనున్నాయి. చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. కేదార్‌నాథ్ ఆలయం ప్రారంభ తేదీ, సమయం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Kedarnath Opening Date 2025

Kedarnath Opening Date 2025 : ఉత్తరాఖండ్‌లో ప్రఖ్యాతి గాంచిన కేదార్‌నాథ్‌‌ను హిందూవులు తమ జీవితంలో ఒకసారైనా దర్శించి తీరాలని భావిస్తుంటారు. కేదార్‌నాథ్‌ ఆలయం ప్రతి 6 నెలలకు ఒకసారి తెరుచుకుంటుంది.

ఈ యాత్ర సందర్భంగా లక్షలాదిమంది భక్తులు బాబా కేదార్‌నాథ్‌ దర్శనానికి తరలివస్తారు. 2025 ఏడాది కూడా కేదార్‌నాథ్‌ దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే.. ఈ ఏడాదిలో మే 2న కేదార్‌నాథ్ తలుపులు తెరచుకోనున్నాయి. కేదార్‌నాథ్‌కు దర్శనానికి వెళ్లే భక్తులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Saturn Transit March 2025 : మార్చిలో అతిపెద్ద గ్రహ సంచారం.. ఈ 5 రాశుల జీవితాల్లో అద్భుతం జరగబోతుంది.. ఇక మీ మాటే శాసనం..!

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ తలుపులు :
దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ 2025 మే 2న తెరుచుకుంటుంది. ఈ ఆలయం చార్ ధామ్ యాత్రలో భాగం. ఇందులో బద్రీనాథ్ ఆలయం, గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం కూడా ఉన్నాయి. చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడంతో ప్రారంభం కానుంది.

బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తప్లియాల్ మాట్లాడుతూ.. కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మే 2, 2025న ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని ప్రకటించారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పవిత్ర దినాన ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో శివుడిని పూజించిన తర్వాత ఈ తేదీని నిర్ణయించారు.

ఆలయాల ప్రారంభ తేదీలివే :
గంగోత్రి ఆలయం, యమునోత్రి ఆలయం 2025 ఏప్రిల్ 30న అక్షయ తృతీయ శుభ దినాన తెరుచుకుంటాయి. కేదార్‌నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకుంటాయి. గంగోత్రి ఆలయం గంగా దేవికి, యమునోత్రి ఆలయం యమునోత్రి దేవికి ప్రతీకగా చెబుతారు. కేదార్‌నాథ్ ఆలయం శివుడికి, బద్రీనాథ్ ఆలయం విష్ణువుకు ప్రతీకగా చెబుతారు.

కేదార్‌నాథ్ ఆలయం గర్హ్వాల్ హిమాలయాలలో ఉంది. ప్రతి ఏడాది లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా శీతాకాలంలో ఆలయం మూసివేస్తారు. వేసవి నెలల్లో 6 నెలల నుంచి 7 నెలల పాటు ఆలయం తెరిచి ఉంటుంది. దీపావళి తర్వాత వచ్చే భాయ్ దూజ్ రోజున ఆలయం సాధారణంగా మూసివేస్తారు.

మార్చి 2 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. బుకింగ్ చేసుకోవాలంటే? :
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు మార్చి 2, 2025 నుంచి ప్రారంభమవుతాయి. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం మీరు ( registrationandtouristcare.uk.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Read Also : SIM Aadhaar Link : మీ వద్ద సిమ్ కార్డులెన్నీ.. ఆధార్‌‌తో ఎన్ని లింక్ అయ్యాయి? ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!

లేదంటే మొబైల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ (ఆండ్రాయిడ్, iOS రెండింటికీ అందుబాటులో ఉంది). మీరు (+91 8394833833) మొబైల్ నంబర్‌లో వాట్సాప్ ద్వారా కూడా మీ బుకింగ్‌లను చేసుకోవచ్చు. వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మీరు “Yatra” అని టైప్ చేయాలి.

ఈ చార్ ధామ్ యాత్రకు గౌరీకుంఢ్‌ నుంచి కేదార్‌నాథ్‌ యాత్రకు కాలినడకన భక్తులు వెళ్తుంటారు. కేదార్‌నాథ్‌ యాత్ర దర్శనం తొందరగా జరగాలంటే హెలిక్యాప్టర్ బుక్ చేసుకోవాలి. కాలినడకన వెళ్తే దాదాపు 16కి.మీ వరకు ప్రయాణించాలి. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. కాలినడక, హెలిక్యాప్టర్ ద్వారా వెళ్లలేనివారికి పల్లకి ద్వారా కూడా దర్శనానికి వెళ్లవచ్చు.