Magha Purnima: నేడే మాఘపౌర్ణమి.. చాలా ప్రత్యేకమైన రోజు.. ఇలా చేస్తే అద్భుత ఫలితాలు మీ సొంతం..!
పుణ్య నదిలో (గంగ, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి) మాఘ పౌర్ణమి రోజున స్నానం చేస్తే 9వేల 600 సంవత్సరాల పాటు ప్రతి రోజు పుణ్య నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది.
Magha Purnima Representative Image (Image Credit To Original Source)
- మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి అంతటి ప్రత్యేకమైన ప్రాధాన్యత
- నువ్వులు, గోవు, వస్త్రం దానం చేయాలి
- పౌర్ణమి రోజున నదీ స్నానంతో అద్భుతమైన ఫలితం
Magha Purnima: ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహా మాఘి అని పిలుస్తారు. 12 నెలల్లో ఏ నెలకి కూడా మహా అనే పేరు రాదు. కానీ, ఒక్క మాఘ మాసానికే పౌర్ణమి రోజు మహా మాఘి అనే పేరు వచ్చింది. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి అంతటి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దేవతలంతా మానవ రూపం ధరించి అదృశ్యంగా వచ్చి భూమి మీదున్న నదుల్లో స్నానం చేసే రోజు మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి రోజున స్నానం ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో స్కాంద పురాణంలో చెప్పారు.
మాఘ పౌర్ణమి సందర్బంగా వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆరేళ్ల పాటు ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పాటు ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పాటు ప్రతి రోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఏదైనా మామూలు నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పాటు నదిలో ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా కలగాలంటే మాఘ పౌర్ణమి రోజున దగ్గరలోని నదిలో స్నానం చేయాలి.
గంగలో స్నానం చేస్తే తిరుగులేదు..
పుణ్య నదిలో (గంగ, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి) మాఘ పౌర్ణమి రోజున స్నానం చేస్తే 9వేల 600 సంవత్సరాల పాటు ప్రతి రోజు పుణ్య నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే నదీ సంగమ ప్రదేశంలో అంటే రెండు నదులు కలిసే చోట కానీ మూడు నదులు కలిసే చోట కానీ మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసినట్లు అయితే 13వేల 600 సంవత్సరాల పాటు ప్రతిరోజు సంగమ స్థలంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజున గంగలో స్నానం చేస్తే ఒక కోటి 36 లక్షల సంవత్సరాల పాటు ప్రతిరోజు గంగలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. గంగలో స్నానం చేస్తే తిరుగులేదు. గంగలో స్నానం చేయలేని వాళ్లు గంగా జలాన్ని నీళ్లలో కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తూ గంగ గంగ అనుకోవాలి.
మాఘ పౌర్ణమి రోజు దానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అన్నింటికంటే గొప్ప దానం నువ్వులు దానం ఇవ్వాలి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. కేజీ పావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. తిల భక్షణం చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయట. అంటే ఆహారంలో నువ్వులను స్వీకరించాలి. మాఘ పౌర్ణమి సందర్బంగా గోదానం చాలా గొప్పది. ప్రత్యక్ష గోవుని దానం ఇచ్చుకోలేని వాళ్లు రాగి లేదా ఇత్తడి లేదా పంచ లోహాలతో చేసిన గోవు బొమ్మన్ని బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. వస్త్ర దానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
