Tirumala Seva Tickets : తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. జూలై నెల కోటా విడుదలకు సంబంధించి కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ నెల 18న విడుదల అర్జితా సేవా టికెట్లను విడుదల చేయాల్సి ఉండగా.. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు అదే సమయంలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగునున్నాయి. భక్తులు ఆన్‌లైన్‌లో జూలై నెల టికెట్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్‌లో టికెట్లను కేటాయిస్తారు. ఎంపిక అయిన వారు టికెట్ ధర మొత్తాన్ని చెల్లించి ఖరారు చేసుకోవచ్చు.
ఈ నెల 22న ఉదయం 10 గంటల నుంచి జూలై నెలకు సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ తదితర శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల చేయనుంది.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో జూలై నెలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు ఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్), కనెక్ట్ చేసిన దర్శన కోటా బుకింగ్ 22 మధ్యాహ్నం 3:00 గంటల నుంచి విడుదల కానున్నాయి.
అదేవిధంగా జూలై నెల తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు 23 ఉదయం 10 గంటల నుంచి జారీ కానున్నాయి. అలాగే, జూలై నెల సీనియర్ సిటిజన్లు /వికలాంగుల కోటా 23 మధ్యాహ్నం 3 గంటల నుంచి విడుదల కానుంది. స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టిక్కెట్లు ఈ నెల 24న ఉదయం 10 గంటల నుంచి విడుదల కానున్నాయి. జూలై నెల తిరుమల, తిరుపతి వసతి కోటా 24 మధ్యాహ్నం 3గంటల నుంచి విడుదల కానుంది.
మే నెల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) టిక్కెట్లు ఈ నెల 24 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మే నెల టీటీడీ స్థానిక దేవాలయాల సేవా టికెట్ల కోటా కూడా ఈ నెల 25న ఉదయం 10 గంటలకు విడుదల కానుంది.
మే నెల సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లు బుకింగ్ కోసం ఈ నెల 25న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.