Horoscope Today : పున్నమి చంద్రుడు ప్రకాశించే ఈరోజు.. ఈ రాశివారికి అదృష్టయోగం, ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయం..!
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.

Horoscope Today
Horoscope Today : రంగుల కేళి హోలీ నవగ్రహాల హంగులకు ప్రతీక! ఒక్కో రంగును శాసించే గ్రహాలు అనుకూలంగా ఉంటే.. ఏ బెంగా ఉండదు. పున్నమి చంద్రుడు దండిగా ప్రకాశించే ఈ రోజు.. మిథునం, సింహం, ధనుస్సు, కుంభ రాశులకు మెండుగా సత్ఫలితాలు కలగనున్నాయి.

Aries
మేషం: మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Taurus
వృషభం: నిన్నటి కన్నా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది. పెద్దల సహకారం లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. భూ లావాదేవీలు అనుకూలం. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

Gemini
మిథునం: ప్రయాణాలు కలిసివస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. శివారాధన శుభప్రదం.

Cancer
కర్కాటకం: ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. సాయంత్రం ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేయడం అవసరం. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

Leo
సింహం: అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి పిలుపు అందుకుంటారు. వ్యాపారులను అదృష్టం వరిస్తుంది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.

Virgo
కన్య: చేపట్టిన పని సులభంగా పూర్తవుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. కుటుబంతో కాలం గడుపుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Libra
తుల: రోజంతా ప్రశాంతంగా సాగుతుంది. విందు పిలుపు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మంచి సమయం. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

Scorpio
వృశ్చికం: ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు తల్తెవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఒత్తిడికి గురవుతారు. సంయమనంతో వ్యవహరించండి. రోజు చివరిలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. రామాలయాన్ని సందర్శించండి.

Sagittarisu
ధనుస్సు: సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా.. పట్టుదల వీడరు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. భవిష్యత్తుకు సంబందించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Capricorn
మకరం: ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పెద్దల సలహాలు పాటించడం అవసరం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యులతో కఠినంగా వ్యవహరించకండి. ఆరోగ్యంపై దృష్టి నిలపడం అవసరం. సూర్యారాధన మేలు చేస్తుంది.

Aquarius
కుంభం: ఈ రోజు అదృష్టయోగం ఉంది. సంతృప్తిగా కాలం గడుపుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. సమయపాలన పాటించడం అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

Pisces
మీనం: సాహసించి పనులు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒక పని విజయవంతం అవుతుంది. శివారాధన మేలు చేస్తుంది.
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.