Horoscope Today : అదృష్టం తలుపుతడుతుంది.. ఈ మూడు రాశుల వారే ఇవాళ్టి కింగ్‌లు..!

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు.

Horoscope Today : అదృష్టం తలుపుతడుతుంది.. ఈ మూడు రాశుల వారే ఇవాళ్టి కింగ్‌లు..!

Today Horoscope

Updated On : March 24, 2025 / 12:11 AM IST

Horoscope Today : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. తుల రాశి జాతకులు ఎంతటి శత్రువునైనా అవలీలగా ఓడిస్తారు. వృశ్చిక రాశి వారికి అదృష్టం తలుపుతడుతుంది. గ్రహగతులు ఈ మూడు రాశుల వారి రేంజ్‌ పెంచుతున్నాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే.. ఇవాళ్టి కింగ్‌లు మీరే!

Aries

Aries

మేషం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. సూర్యారాధన మేలు చేస్తుంది.

Taurus

Taurus

వృషభం: గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా, బయటా సంతోషంగా ఉంటారు. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. శివారాధన శుభప్రదం.

Gemini

Gemini

మిథునం: ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. రామాలయాన్ని సందర్శించండి.

Cancer

Cancer

కర్కాటకం: నిన్న ఉన్న పరిస్థితులు ఈ రోజు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శివాలయాన్ని సందర్శించండి.

Leo

Leo

సింహం: శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కొత్త పరిచయాలతో ఇబ్బందులు ఏర్పడతాయి. భూములు, వాహనముల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.

Virgo

Virgo

కన్య: ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ప్రయాణాల వల్ల అలసట, ఇబ్బంది ఎదురువుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. చివర్లో ఒక శుభవార్త వింటారు. హనుమాన్‌ చాలీసా పఠించండి.

Libra

Libra

తుల: ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం. పై అధికారులతో స్నేహంగా మెలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Scorpio

Scorpio

వృశ్చికం: నిన్నటితో పోలిస్తే అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి.

Sagittarisu

Sagittarisu

ధనుస్సు: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అన్నదమ్ములు, బంధుమిత్రులతో చికాకులు తలెత్తుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ష్యూరిటీలు ఇవ్వకండి. ట్రేడింగ్‌లో దూకుడుగా వ్యవహరించకండి. లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తుంది.

Capricorn

Capricorn

మకరం: ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. బంధుమిత్రులతో వైషమ్యాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Aquarius

Aquarius

కుంభం: వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ తగ్గుతుంది. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

Pisces

Pisces

మీనం: ఈ రోజు అనుకూలం. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. మంచివారితో స్నేహం కుదురుతుంది. రామాలయాన్ని సందర్శించండి.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)

టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.