Horoscope Today: కాలసర్ప యోగం యాక్టివేటింగ్.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ ఫలితాలు..!
ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చాలా రోజులుగా వెంటాడుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రామనామం స్మరించండి.

Today Horoscope
Horoscope Today: రాహు, కేతువుల మధ్య మిగతా గ్రహాలు ఉంటే.. దానిని కాలసర్పదోషం అంటారు. గత నెల 27న కాలసర్పదోషం ఏర్పడింది. ఇది మే 11వ తేదీ వరకు కొనసాగనుంది. రెండు గ్రహాలు నీచ పొంది ఉండటం, రెండు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండటం ఈ పరిస్థితులు కొన్ని విపరీతాలకు దారితీస్తాయి. అయితే వ్యక్తిగత జాతకాల విషయానికి వస్తే.. ఈ కాంబినేషన్ మేషం, సింహం, తుల రాశులకు ఆకస్మిక శుభ ఫలితాలు ఇస్తుంది.
మేషం: విపరీత యోగం ఉంది. ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెద్దల అండదండలు లభిస్తాయి. రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. శివారాధన శుభప్రదం.
వృషభం: ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చాలా రోజులుగా వెంటాడుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రామనామం స్మరించండి.
మిథునం: కష్టేఫలి అన్న చందంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వ్యక్తులు పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. ఏమరుపాటు తగదు. ఆర్థికంగా ఆశించినట్లు ఉంటుంది. సాయంత్రానికి ఒక శుభవార్త వింటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
కర్కాటకం: శారీరక శ్రమ అధికం అవుతుంది. మానసికంగా ఒత్తిళ్లు అధికం అవుతాయి. ఆర్థికంగా అయోమయ పరిస్థితులు నెలకొంటాయి. ఆన్‌లైన్ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఈశ్వరారాధన శుభప్రదం.
సింహం: పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని రోజులుగా ఇబ్బందిపెడుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య: నమ్మిన వాళ్లే వ్యతిరేకంగా పనిచేస్తారు. పెట్టుబడుల విషయంలో పక్కదారి పట్టిస్తారు. కుటుంబంలో కలహ వాతావరణం ఏర్పడుతుంది. సాయంత్రానికి పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయి. రామాలయాన్ని సందర్శించండి.
తుల: ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. కుటుంబం మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఒక శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చికం: ఎదుటివారిని తక్కువ అంచనా వేయకండి. పరిస్థితులు ఒక్కసారిగా మారే ప్రమాదం ఉంది. దాయాదులతో వివాదాలు తలెత్తవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. హనుమాన్ చాలీసా పఠించండి.
ధనుస్సు: ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలహ సూచన. అనుకున్న పనులు వాయిదా పడతాయి. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు జాగ్రత్త. సాయంత్రానికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. రామనామం స్మరించండి.
మకరం: ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు వాయిదా పడతాయి. సోదరులతో వైరం ఏర్పడుతుంది. ఆస్తి క్రయవిక్రయాల్లో అనాలోచితంగా ఆలోచిస్తుంటారు. సంయమనం పాటించడం అవసరం. శివారాధన మేలు చేస్తుంది.
కుంభం: ఏదో వెలితి వెంటాడుతుంది. చిన్న చిన్న విషయాలనూ అతిగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. సాయంత్రానికి పరిస్థితి అనుకూలంగా మారుతుంది. నరసింహస్వామి సేవ చేసుకోండి.
మీనం: రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు అధికమవుతాయి. మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందదు. కుటుంబంలో కలహ సూచన. వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.