Mesha Rashi Ugadi Rasi Phalalu 2025 : మేష రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి.

Aries
Mesha Rashi Ugadi Rasi Phalalu 2025 : కొత్త ఆశలతో అడుగుపెట్టిన ఉగాది.. కొన్ని రాశుల వారిని ఆర్థికంగా అనుగ్రహిస్తే, మరికొన్ని రాశుల వారి యశస్సు పెంచనుంది. త్రిగ్రహ, చాతుర్ గ్రహ, పంచగ్రహ కూటములు అన్ని రాశుల వారినీ ఎంతో కొంత చికాకు పెడతాయి. ముఖ్యంగా మేష రాశికి ఏల్నాటి శని ప్రారంభం అవుతున్నది. సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని చికాకులు తెప్పిస్తుంది.
అయితే, ఈ మూడు రాశులకూ రాహు, కేతువులు అండగా నిలవనున్నారు. మేషరాశికి లాభ రాహువు, ధనుస్సు రాశికి సప్తమ గురువు, సింహరాశికి లాభ గురువు ఉండటం వల్ల.. శని వల్ల కలిగే ఆటంకాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టవు. ఈ మూడు రాశుల వారూ నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. శక్తి మేరకు అనాథలకు దాన ధర్మాలు చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 2
వ్యయం: 14
రాజపూజ్యం: 5
అవమానం: 7
చైత్రం: ఈ నెల మిశ్రమంగా ఉంటుంది.
ఆశించిన స్థాయిలో రాబడి ఉండదు.
ఉద్యోగ రీత్యా బదిలీలు ఉంటాయి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వాహనం మూలంగా పనులు నెరవేరతాయి.
వైశాఖం: పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. భూ, వాహన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆత్మీయులతో తగాదాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు ముందుకు వస్తాయి.
జ్యేష్ఠం: ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు సరైన సమయంలో నెరవేరుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆషాఢం: ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
శ్రావణం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువర్గం, స్నేహితుల సూచనలను పాటించి, సత్ఫలితాలను పొందుతారు.
భాద్రపదం: ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ, రాజకీయ పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఆశ్వయుజం: తలపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఇంటా, బయటా అను-కూల వాతావరణం ఉంటుంది. సకాలంలో నిర్ణయాలను తీసుకుంటారు. నలు-గురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కార్తికం: ఈ నెలలో సంతృప్తికర ఫలితాలు ఉన్నాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది.
మార్గశిరం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయ-కంగా కొనసాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
పుష్యం: ఈ మాసంలో గ్రహస్థితి సత్ఫలితాలనిస్తుంది. సంగీత, సాహిత్య, కళా-కారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి.
మాఘం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. సమస్యలు తీరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
ఫాల్గుణం: ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమ ఫలితాలనిస్తుంది. ప్రారంభించిన పనులలో శ్రమ ఎక్కువ అవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ రీత్యా స్థల మార్పు ఉంటుంది.