Vastu Tips : మీ ఇంట్లో అద్దం ఇలా ఈ దిశలో పెడితే అదృష్టమే అదృష్టం.. డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది!

Vastu Tips : వాస్తు ప్రకారం.. ఇంట్లో అద్దాన్ని ఏయే దిశలో ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా? ఇలాగానీ అద్దాన్ని ఏర్పాటు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కనకవర్షమే కురుస్తుందని విశ్వాసం..

Vastu Tips : మీ ఇంట్లో అద్దం ఇలా ఈ దిశలో పెడితే అదృష్టమే అదృష్టం.. డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది!

Vastu Tips for placing mirror

Updated On : February 14, 2025 / 5:05 PM IST

Vastu Tips : హిందూపురాణాల్లో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంట్లో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటిస్తేనే ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవు. వాస్తుపరంగా అనేక అంశాలు ఆర్థిక ఎదుగుదలకు, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి.

అందుకే వాస్తు శాస్త్రాన్ని విధిగా పాటించాలని వాస్తు నిపుణులు సైతం సూచిస్తున్నారు. వాస్తు ప్రకారంగా చెప్పాలంటే.. అసలు ఇంట్లో అద్దాన్ని ఎలా పెట్టుకుంటే కలిసివస్తుందో అనేక విషయాలను వెల్లడించారు. ఒకవేళ, ఇంట్లో అద్దం విషయంలో కొన్ని పొరపాటు చేస్తే.. ఆ ఇంట్లో ఉండేవారికి అనేక సమస్యలు వస్తాయి. నెగిటివ్ ఎనర్జీ కూడా పెరిగిపోయి తీవ్ర మానసిక క్షోభకు గురవుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Read Also : Vastu Tips : మీ ఇంట్లో వాస్తు దోషాలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పనులు తప్పక చేయండి!

ఇంతకీ, వాస్తుపరంగా అద్దాన్ని ఏయే దిశల్లో ఉంచితే శుభ ఫలితాలు జరుగుతాయి? ఎక్కడ పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రంలో అద్దాలను ఇంట్లో సరైన దిశలో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అయితే, కొన్ని నియమాలను పాటించడం ద్వారా అంతులేని ఆనందాన్ని పొందవచ్చు. అద్దం ఏర్పాటుకు సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో ఉత్తరం లేదా తూర్పు గోడకు అద్దాలను ఉంచాలి.

అద్దాన్ని ఇలా ఏర్పాటు చేసుకోండి :
ఎందుకంటే.. ఈ రెండు దిశలు అద్దాలకు శుభప్రదమైనవిగా చెబుతారు. మీ అద్దం నేల నుంచి కనీసం 4 నుంచి 5 అడుగుల ఎత్తులో ఉంచడం ఎంతైనా మంచిది. మీ స్టడీ టేబుల్ దగ్గర అద్దం ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. అది మీ ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు. మీ ఇంట్లో డబ్బులు ఉంచే లాకర్ ఎదురుగా అద్దం పెట్టడం వల్ల ఆర్థికపరంగా అనేక లాభాలు కలుగుతాయని నమ్ముతారు.

మీరు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. వాస్తువిషయానికి వస్తే.. మీ షాపు లేదా ఏదైనా దుకాణంలో రెండు వైపులా అద్దాలు ఉంచుకోవడం వల్ల ఆర్థికపరంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. చాలామంది లాకర్ లోపల కూడా అద్దాలను ఉంచుతారు.

అద్దాన్ని ఎలా ఉంచకూడదంటే? :
వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో అద్దాలకు ఇలా అపసవ్య దిశలో అసలు ఉంచకూడదు. రెండు అద్దాలు ఎదురుగా ఉండకూడదు. ఆ ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అద్దం బెడ్ రూంలో కూడా అసలు ఉండకూడదని గమనించాలి. మీ వంటగదిలో కూడా అద్దం ఉంచరాదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుంది.

Read Also : CIBIL Score : మీ సిబిల్ స్కోరు తగ్గడానికి 5 కారణాలివే.. పొరపాటున కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయెద్దు..!

ఈ ఆగ్నేయ దిశ అసలు మంచిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా అద్దం అసలు ఉంచకూడదు. ఇంటి తూర్పు దిశలోనే అద్దం ఉండాలి అనేది నియమం. తూర్పు సూర్యదేవున్ని ప్రతీక. ఇంటి ఈశాన్య గోడపై అద్దం ఉంచితే మంచి పురోగతి లభిస్తుంది.

బెడ్ రూంలో అద్దం పొరపాటున కూడా ఉంచకూడదు. ఒకవేళ అలా ఉంచాలనుకుంటే పడుకునే సమయంలో ఆ అద్దాన్ని ఏదైనా గుడ్డతో కప్పేయండి. అద్దంలో మంచం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, ఇంట్లో అద్దాలు పగిలినవి, ఫర్నిచర్ విరిగినవి ఉండకూడదు. అలా ఉంచితే నెగిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తాయి. పగిలిన అద్దం చూడటం అశుభానికి సంకేతంగా చెబుతారు.