ఈ వారం రాశిఫలాలు (జనవరి 4 నుంచి 10 వరకు).. కొత్త ఏడాది ఆరంభంలోనే వీరికి డబ్బులే డబ్బులు..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన 12 రాశుల ఫలితాల వివరాలు...

ఈ వారం రాశిఫలాలు (జనవరి 4 నుంచి 10 వరకు).. కొత్త ఏడాది ఆరంభంలోనే వీరికి డబ్బులే డబ్బులు..

Rashi Phalalu (Image Credit To Original Source)

Updated On : January 4, 2026 / 2:30 PM IST

ఈ వారం రాశిఫలాలు (జనవరి 4 నుంచి 10 వరకు)

గురువు మిధున రాశిలో వక్రస్థితి
శని మీన రాశిలో వక్రగతి
రాహుకేతువులు కుంబ సింహ రాశులలో
రవి, బుధ, కుజ శుక్ర గ్రహములు ధనస్సు రాశిలో
చంద్రుడు మిధున, కర్కాటక సింహ కన్యాతులా రాశులలో సంచారం
చాతుర్గహ కూటమి ఏర్పడింది

మేష రాశి: కుటుంబంలో ఇబ్బందులు, అనవసరమైన తగాదాలు, చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకోవద్దు. ధనవ్యయము, ప్రయుణములో అలసట, వృత్తి, ఉద్యోగ భంగములు కలుగుతుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి, కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధనం వల్ల మేలు కలుగుతుంది.

వృషభ రాశి: అన్ని పనులు సకాలంలో కావడం, వృత్తి, వ్యాపార రంగములో అభివృద్ధి, ప్రయాణముల వలన లాభము కలగడం, శుభ కార్యక్రమములు నిర్వహించుట, ప్రతి పనిలో విజయము అన్నింటా లాభము, నూతన వ్యాపారములో విజయం, స్త్రీలు ఉద్యోగం గురించి ఆలోచన చేస్తారు. లలితా స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం జరుగుతుంది.

మిధున రాశి: కుటుంబములోని వారు ఆరోగ్యముగా ఉంటారు. ధనధాన్య సంపదలు, స్త్రీలతో ప్రియ సంభాషణలు చేయటం, ధార్మిక పద్ధతులతో నడుచుకొంటారు. దైవ పుణ్యకార్యములలో చురుకుగా పాల్గొంటారు, పై అధికారుల ఆదరాభిమానములు పొందుతారు.
శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం చేసినచో శుభం ఫలితములు పొందుతారు.

కర్కాటక రాశి: మనో వేదనల వలన నిర్ణయమునకు రాలేరు, సంతానం ద్వారా శుభవార్తలు, మనఃశాంతి లోపించండం, ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లడం, అన్నింటా విజయం, నూతన వ్యాపారములు ప్రారభించవచ్చు, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసినా మేలు కల్గును.

సింహ రాశి: స్వస్థానములో మేలు జరుగును, ధనధాన్య లాభములు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగును, సంఘంలో అన్యస్త్రీ పరిచయ భాగ్యములు, పనిని సమర్థవంతముగా నిర్వహిస్తారు, ప్రయాణముల వల్ల లాభములు కలుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనవల్ల మేలు కలుగును.

కన్యా రాశి: బంధు విరోధములు, బుద్ధి చాంచల్యములు కలుగును, శరీరపీడ, నీచ స్త్రీ మూలక కలహములు, అనవసర కార్యములకు ధనవ్యయము, అపకీర్తి రాకుండా కాపాడుకోవాలి. రుణబాధలు, మోసపోవడం, ఎవరినీ నమ్మకూడదు. బంధువర్గంలో గౌరవము పెరుగును. ఇష్ట దైవ ఆరాధన చేసినచో అంతా మేలు జరుగును.

తులా రాశి: పిత్రార్జితము రావడం, మంచి ఉద్యోగములు రావడం, ధనలాభములు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, అన్నదమ్ములతో అనుకూలతలు కల్గును, వివాహ సంబంధములు కుదురును, సంతానము ద్వార శుభవార్తలు, అన్ని పనులలో విజయము, బంధుమిత్రులతో విందు వినోదములతో కాలము గడుపుదురు. శివారాధన చేయటం వల ఇబ్బందులు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి: ధనవిషయంలో చికాకులు, అకాల భోజనములు, రోగ బాధలు కలుగును, ఉద్యోగంలో ప్రతికూలము, ప్రయాణంలో లాభములు, మానసిక వేదనలు, ప్రతి విషయములో విచారములు కలగడం, నమ్మినవారి వలన మోసపోవడం, బంధు మిత్రులతో విరోధములు కలగడం, అనవసరపు విషయములలో జాగ్రత్త అవసరం, వ్యాపారంలో ఇబ్బందులు. అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఉత్తమైనపు ఫలితములు కలుగును.

ధనస్సు రాశి: అకస్మిక ప్రయాణముల వలన లాభములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, జాయింటుదారులతో అనుకూలత, ధనప్రాప్తి, వస్త్ర లాభము, ఆరోగ్యము, జయము, ఎంతటి పనినైనను ధైర్యసాహసములతో చేసి విజయమును పొందుతారు, దూర ప్రాంతపు ప్రయూణములు అనుకూలించును. శ్రీ రామనామ జపం చేయండి.. శుభ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి: కోర్టు వ్యవహారములు వాయిదా పడటం, దూరపు ప్రాంతములకు వెళ్లవలసివచ్చును. శుభకార్యక్రమములకు ఆటంకములు విద్యుత్తు పరికరములు, మిషనరీలు, వాహనమల కొనుగోలు, రావలసిన బాకీలు వసూలు చేయుట, నూతన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేయడం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల సమస్యలు తొలగుతాయి.

కుంభం: కుటుంబములోని వారికి ఆరోగ్యము తగ్గుతుంది, చేయుపనులయందు కష్టనష్టములు ఎదురు అవుతాయి, పనిలేని ప్రయాణములు, పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారముల యందు దిగువ వారి సహాయములు ఉండవు. శ్రీకృష్ణ మంత్రజపం చేయవలెను.. మంచి ఫలితములు కలుగుతాయి

మీన రాశి: ఆర్థికంగా లాభములు, అనారోగ్యము, వృత్తి వ్యాపారములలో అధిక లాభములు, వాహనములు కొనుగోలు చేయడం, శత్రువులు మిత్రులుగా మారడం, భూలాభములు, ఇండ్లు కొనుగోలు చేయడం, స్నేహితులతో గడపటం, భార్యభర్తల మధ్య అనుకూలత, రుణ బాధలు తగ్గడం. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆరాధన వలన మేలు జరుగుతుంది.

 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956