2026 Kawasaki Ninja 500 : ఇది బైక్ కాదు.. రోడ్లపై రాకెట్! E20 ఇంధనంతో దూసుకెళ్లే కొత్త కవాసకి నింజా.. ధర తెలిస్తే షాకవుతారు!
2026 Kawasaki Ninja 500 : 2026 కవాసకి నింజా 500 బైక్ వచ్చేసింది చూశారా? E20 ఇంజిన్‌తో రన్ అయ్యే ఈ బైకు మార్కెట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
2026 Kawasaki Ninja 500
- భారత మార్కెట్లోకి కొత్త 2026 కవాసకి నింజా 500 బైక్
- ఈ బైకు ఇంజిన్ ఇప్పుడు E20 ఇథనాల్‌తో రన్ అవుతుంది
- కవాసకి నింజా బైకు ధర రూ. 5.76 లక్షలు (ఎక్స్-షోరూమ్)
2026 Kawasaki Ninja 500 : కొత్త బైక్ కొనేవారి కోసం మార్కెట్లోకి అద్భుతమైన సూపర్ బైక్ వచ్చేసింది. మీరు స్టైలిష్ బైక్‌లను ఇష్టపడేవారు అయితే ఇది మీకోసమే.. కొంచెం ఖరీదైన మంచి బైక్ కొనాలని చూస్తుంటే ఇంతకన్నా బెటర్ బైకు దొరకదు.. అందులోనూ E20 ఫ్యూయల్ సపోర్టు చేసే వాహనాలే కొనేందుకు వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పుడు కవాసకి కంపెనీ భారతీయ యూజర్ల కోసం (2026 Kawasaki Ninja 500) 2026 కవాసకి నింజా 500 కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇంజన్ ఇప్పుడు E20 ఫ్యూయల్ కోసం ట్యూన్ చేశారు. 2026 కవాసకి నింజా 500 భారత మార్కెట్లో రూ. 5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభ్యమవుతోంది.
ఈ బైక్‌లో అతిపెద్ద మార్పు ఇంజిన్ మాత్రమే.. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా E20 ఫ్యూయల్ ఇంజిన్ అందిస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు క్రమంగా 20శాతం ఇథనాల్ పెట్రోల్ మాత్రమే అందించనున్నాయి. పాత ఇంజిన్లు ఈ ఫ్యూయల్‌ను తట్టుకోలేవు. ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు.. ఈ కవాసకి బైక్ పవర్ టార్క్ అవుట్‌పుట్‌లో ఎలాంటి మార్పు లేదు. రైడ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. అయితే, కలర్ ఒక్కటే మారింది. కవాసకి పాత పెయింట్ ఆప్షన్ కాకుండా క్లాసిక్ లైమ్ గ్రీన్ షేడ్‌కు మారింది. ప్రస్తుతం ఈ బైకు బుకింగ్‌లు ముందే ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు నాటికి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
E20 నిబంధనలతో వచ్చే మార్పులివే :
కవాసకి నింజా 500 2026 బైకు హుడ్ కింద గతంలో మాదిరిగా అదే 451cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంది. 9,000rpm వద్ద సుమారు 44.3 bhp 6,000rpm వద్ద 42.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్-అండ్-స్లిప్పర్ క్లచ్ ఉంటాయి.
ఇంజన్ ట్యూనింగ్, ఫ్యూయల్ సిస్టమ్ ఉన్నాయి. ఇప్పుడు E20 ఫ్యూయల్ సపోర్టు చేసేలా ఈ బైకును రూపొందించారు. ఇందులో కేవలం టెక్నికల్ అప్డేట్ మాత్రమే కాదు. హై ఇథనాల్ ఫ్యూయల్ ఇంజన్లు, ఫ్యూయల్ లైన్లు తుప్పు పట్టడం లేదా ఇంజన్ పర్ఫార్మెన్స్ వంటి సమస్యలు ఉండవు.
సింగిల్ లైట్ గ్రీన్ కలర్, మిగతావన్నీ సేమ్ :
స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ హారిజాంటల్ బ్యాక్లింక్ సస్పెన్షన్‌తో సహా మిగతావన్నీ ఒకేలా ఉన్నాయి. 17-అంగుళాల వీల్స్‌పై బైకు నడుస్తుంది, ఫ్రంట్ సైడ్ 110-సెక్షన్, బ్యాక్ సైడ్ 150-సెక్షన్ టైర్లు అమర్చి ఉన్నాయి. రెండు వైపులా డిస్క్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో పాటు అందుబాటులో ఉన్నాయి. డాష్‌బోర్డ్‌లో బ్లూటూత్ ఆధారిత ఫోన్ కనెక్టివిటీతో అద్భుతమైన ఎల్సీడీ యూనిట్ ఉంది.
షోరూమ్ వద్ద సింగిల్ కలర్ ఒక్కటే ఉంది. ఈసారి లైమ్ గ్రీన్ కలర్ నింజా 500 కవాసకి నింజా ఫ్యామిలీతో వచ్చింది. నింజా 500 కేవలం సింగిల్ వేరియంట్లో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ బైకు ధర రూ. 5.76 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
