బంగారానికి తాకిన కరోనా.. రేట్లు పెరిగిపోయాయ్!

మూడ్రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం కొనుగోలుదారునికి షాక్ ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇన్వెస్టర్లు అనాసక్తి చూపించడం పతనానికి ఓ కారణం. ఫలితంగా పసిడితో పాటు వెండి ధర కూడా పైపైకి ఎగబాకుతుంది.
చైనా కరోనా వైరస్ భయాలు బంగారానికి కలిసొచ్చాయి. మరణాల భయం ఒక్కసారిగా పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపారు. ఈ ఎఫెక్ట్ మన మార్కెట్‌పై కూడా పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకుంది. రూపాయి కూడా బలహీనపడటంతో పసిడి పరుగు ఊపందుకుంది.
హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర పైకి కదలడంతో పసిడి 10 గ్రాముల ధర రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.38వేల 640 నుంచి రూ.38,880కు ఎగబాకింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41వేల 835 నుంచి రూ. 42వేల 85కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు అధికంగానే ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38వేల 880కు చేరింది. వెండి ధర రూ.49వేలకు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.250 పైకి కదిలింది. దీంతో ధర రూ.40వేల 900కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.39వేల 700కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.200 పెరుగుదలతో రూ.49వేలఃకు చేరింది.
వెండి ధర కూడా టాప్ లేపుతుంది. కేజీ వెండి ధర రూ.200 పైకి కదిలింది. దీంతో రూ.48,800 నుంచి రూ.49,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయరీదారుల నుంచి డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణం. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.