Airtel Digital TV Plans : ఎయిర్‌టెల్ కొత్త డిజిటల్ టీవీ ప్లాన్లు.. అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ కూడా..!
Airtel Digital TV Plans : ఈ ప్లాన్‌లలో ముందుగా, హెచ్‌డీ క్వాలిటీతో రెండు డివైజ్‌లలో ప్రైమ్ వీడియోని ఆస్వాదించవచ్చు. అంటే.. మీ ఇంటిలోని మరొకరు అదే సమయంలో మీకు ఇష్టమైన సినిమాలు, షోలను వీక్షించవచ్చు.

Airtel announces new Digital TV plans with Amazon Prime Lite membership
Airtel Digital TV Plans : ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వినియోగదారుల కోసం ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. లైవ్ టీవీ, అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌లను కలిపి రెండు అద్భుతమైన కొత్త ప్లాన్‌లను రిలీజ్ చేసింది. ఈ ప్లాన్‌లు సాంప్రదాయ టీవీని అమెజాన్ ప్రైమ్ వీడియోకు యాక్సెస్ పొందవచ్చు. టీవీ వీక్షకులకు అనేక రకాల కొత్త కంటెంట్‌ను కూడా అందిస్తుంది. అలాగే అమెజాన్ నుంచి కొన్ని కూల్ షాపింగ్ పెర్క్‌లను కూడా అందిస్తుంది.
హెచ్‌డీ క్వాలిటీ, రెండు డివైజ్‌ల్లో యాక్సెస్ :
ఈ ప్లాన్‌లలో ముందుగా, హెచ్‌డీ క్వాలిటీతో రెండు డివైజ్‌లలో ప్రైమ్ వీడియోని ఆస్వాదించవచ్చు. అంటే.. మీ ఇంటిలోని మరొకరు అదే సమయంలో మీకు ఇష్టమైన సినిమాలు, షోలను వీక్షించవచ్చు. దానిపైన, మీరు 350 కన్నా ఎక్కువ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందుతారు. లైవ్ స్పోర్ట్స్ వీక్షించినా లేదా మీ రోజువారీగా ప్రతి ఒక్కరినీ అలరించడానికి అనేక టీవీ షోలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్డర్ చేసిన రోజే డెలివరీ :
ఇప్పుడు, అమెజాన్ ప్రైమ్ లైట్ విషయానికి వస్తే.. సాధారణ ప్రైమ్ మెంబర్‌షిప్ టోన్-డౌన్ వెర్షన్. కానీ, ఇప్పటికీ అనేక బెనిఫిట్స్‌తో వస్తుంది. మీరు 10 లక్షలకు పైగా ప్రొడక్టులపై అదే రోజు ఫ్రీ డెలివరీని, 40 లక్షల కన్నా ఎక్కువ ఉత్పత్తులపై మరుసటి రోజు డెలివరీని పొందవచ్చు. అదనంగా, మీరు అమెజాన్ సేల్స్, ఆకర్షణీయమైన డీల్‌లకు ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. అమెజాన్ పేలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చేసిన కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ లైట్ ప్యాక్ ప్రారంభ ధర :
మీరు ఈ ప్లాన్‌లతో ఎంటర్‌టైన్మెంట్ కన్నా ఎక్కువగా షాపింగ్ పెర్క్‌లు కూడా పొందవచ్చు. ధర కూడా చాలా తక్కువే. హిందీ అల్టిమేట్ అండ్ అమెజాన్ ప్రైమ్ లైట్ 1-నెల ప్యాక్ కోసం ప్లాన్‌లు కేవలం రూ. 521 నుంచి ప్రారంభమవుతాయి. 30 రోజుల పాటు యాక్సెస్‌ని అందిస్తుంది. మీరు దీర్ఘకాలిక ప్లాన్ల కోసం చూస్తుంటే.. రూ. 2288కి 6 నెలల ప్లాన్ కూడా ఉంది. లాంగ్ టైమ్ ప్లాన్ తీసుకుంటే చాలా చౌకైన ధరకే పొందవచ్చు.