Amazon Sale: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై 40శాతం డిస్కౌంట్.. ఆఫర్ జనవరి 10 వరకు!
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మొబైల్ & టీవీ సేవింగ్స్ డే సేల్‌ను ప్రకటించింది.

Amazon announces Mobile
Amazon Sale: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ మొబైల్ & టీవీ సేవింగ్స్ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ 10 జనవరి 2022 వరకు లైవ్‌లో ఉంటుంది. సేల్‌లో భాగంగా OnePlus, Xiaomi, Samsung, OPPO, Tecno, Vivo మరియు Realme బ్రాండ్‌లను చౌకగా కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో.. మీరు సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపుతో గరిష్టంగా రూ. 1,250 ఆఫర్ పొందవచ్చు. అలాగే, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపు వస్తోంది. కస్టమర్లకు గొప్ప ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ సభ్యులు రూ.20వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Amazon ప్రీమియం ఫోన్ పార్టీ ఈవెంట్ జనవరి 12 వరకు లైవ్‌లో ఉంటుంది. ఈ సమయంలో కస్టమర్‌లు తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో, మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఫోన్ కొనుగోలుపై రూ.5వేల వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.
ఈ సెల్‌లో రూ. 23,499కి Mi 11X కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీరు రూ. 19,999కి Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ఇందులో డిస్కౌంట్, బ్యాంక్, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి.
అత్యధికంగా అమ్ముడవుతున్న Redmi 9A స్మార్ట్‌ఫోన్ 7,199 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇందులో 10 శాతం ఇన్‌స్టంట్ ఆఫర్ ఉంది. Redmi TV 32 అంగుళాల HD Smart TVని రూ.14,999కి కొనుగోలు చేసుకోవచ్చు. మీరు Redmi TV 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 37,999కి కొనుగోలు చేసుకోవచ్చు. Mi 40inch Horizon FHD TVని రూ.6000 తగ్గింపుతో రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy S20 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను 46 శాతం తగ్గింపుతో రూ. 39,990కి కొనుగోలు చేయవచ్చు.
OnePlus 9R స్మార్ట్‌ఫోన్ రూ. 33,999, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 36,999 మరియు వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999. బ్యాంకింగ్ డిస్కౌంట్లు, కూపన్లు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఎక్స్‌ట్రా..
iQOO Z5ని రూ.21,990కి మరియు iQOO 7 స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,990కి కొనుగోలు చేసుకోవచ్చు.