Amazon Freedom Sale : జూలై 31 నుంచే అమెజాన్ ఫ్రీడమ్ సేల్.. టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

Amazon Freedom Sale : అతి త్వరలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్ ప్రారంభం కానుంది. ఫోన్లపై డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Amazon Freedom Sale : జూలై 31 నుంచే అమెజాన్ ఫ్రీడమ్ సేల్.. టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

Amazon Freedom Sale

Updated On : July 29, 2025 / 7:43 PM IST

Amazon Great Freedom Festival 2025 : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? అయితే, మరో రెండు రోజులు ఆగండి.. భారతీయ వినియోగదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ (Amazon Freedom Sale) ఫెస్టివల్ 2025 సేల్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. జూలై 31న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభమవుతుంది.

ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్ డివైజ్‌లు, అమెజాన్ డివైజ్‌లు, హోం అప్లియన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందించనుంది.

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ 12 గంటలు ముందుగానే అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ దిగ్గజం గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2025 సేల్‌కు ముందు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6, ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R వంటి మరిన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందించనుంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై అద్భుతమైన ఆఫర్లను అందించనుంది. ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ. 1,34,999 ఉంటే.. తగ్గింపు ధర రూ. 79,999 మధ్య ఉండొచ్చు.

Read Also : Vivo V60 Launch : కొత్త వివో V60 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

అలాగే, ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 69,900 నుంచి రూ. 58,249కి కొనుగోలు చేయవచ్చు. ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. అమెజాన్ ఎస్బీఐతో భాగస్వామ్యంతో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు. అమెజాన్ పే ఆధారిత ఆఫర్‌లు, కూపన్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఏయే బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ధర ఎంత అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు :

  • శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,34,999,  తగ్గింపు ధర రూ.79,999
  • ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.69,900,  తగ్గింపు ధర రూ.58,249
  • ఐక్యూ Z10R 5G ఫోన్ ప్రారంభ ధర రూ.23,499,  తగ్గింపు ధర రూ.17,499
  • వన్‌ప్లస్ నార్డ్ CE 5 ప్రారంభ ధర రూ.24,999,  తగ్గింపు ధర రూ.22,999
  • శాంసంగ్ గెలాక్సీ M36 5G ప్రారంభ ధర రూ.22,999,  తగ్గింపు ధర రూ.15,999
  • రెడ్‌మి 13 ప్రైమ్ (8+128GB) ప్రారంభ ధర రూ.19,999,  తగ్గింపు ధర రూ.11,249
  • రియల్‌మి నార్జో 80 లైట్ 5G ప్రారంభ ధర రూ.14,999,  తగ్గింపు ధర రూ.10,499
  • ఐక్యూ నియో 10R 5G ప్రారంభ ధర రూ.31,999,  తగ్గింపు ధర రూ.22,999
  • వన్‌ప్లస్ 13R ప్రారంభ ధర రూ.44,999,  తగ్గింపు ధర రూ.36,999
  • ఒప్పో రెనో 14 5G ప్రారంభ ధర రూ.42,999,  తగ్గింపు ధర రూ.34,200