Amazon Mobile Deals : సూపర్ ఆఫర్లు భయ్యా.. అమెజాన్‌‌లో ఈ 3 స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి!

Amazon Mobile Deals : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి లావా బోల్ట్ 5జీ, ఒప్పో F29 ప్రో 5G, వన్‌ప్లస్ 13R ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

Amazon Mobile Deals : సూపర్ ఆఫర్లు భయ్యా.. అమెజాన్‌‌లో ఈ 3 స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి!

Amazon Mobile Deals

Updated On : April 20, 2025 / 6:10 PM IST

Amazon Mobile Deals : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, అత్యంత సరసమైన ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు గేమింగ్, ఎంటర్‌టైన్మెంట్ ఇష్టపడేవారైతే ఇది మీకోసమే.. లాంగ్ టైమ్ బ్యాటరీ ఫోన్ కొనేందుకు సరైన సమయం. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో అనేక లాంగ్ బ్యాటరీ ఫోన్ మోడల్స్ లభ్యమవుతున్నాయి.

Read Also : iPhone 15 : ఆఫర్ అదిరింది బ్రో.. మీ శాంసంగ్ ఫోన్‌తో తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు.. ఈ బంపర్ డిస్కౌంట్ మళ్లీ రాదు!

ఎందుకంటే.. ఈ ఫోన్‌లలో 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తాయి. తక్కువ సమయంలో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. బంపర్ ఆఫర్లతో మీరు అమెజాన్ డీల్స్ నుంచి ఈ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నో-కాస్ట్ ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ లిస్టులో టాప్-బ్రాండెడ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి.

లావా బోల్డ్ 5G :
లావా నుంచి ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. మీ బడ్జెట్‌లో సరిగ్గా సరిపోతుంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో స్ట్రాంగ్ బ్యాటరీని అందిస్తుంది. 3D కర్వ్డ్ ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌ను పొందవచ్చు. 64MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. మీరు అమెజాన్ డీల్స్ నుంచి 28శాతం తగ్గింపుతో కేవలం రూ. 12,999కు కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో F29 ప్రో 5G :
ఈ ఒప్పో ఫోన్ 256GB స్టోరేజ్‌తో వస్తుంది. మీరు 360-డిగ్రీల డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీని పొందవచ్చు. అదే సమయంలో మీరు ఈ ఫోన్‌ను స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పొందవచ్చు. అదే సమయంలో IP69 వాటర్‌ప్రూఫ్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. గ్రానైట్ బ్లాక్ కలర్‌లో స్లిమ్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. మీరు ఇప్పుడు కేవలం రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 13R :
ఈ వన్‌ప్లస్ ఫోన్ AI ఫీచర్లతో వస్తుంది. 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ప్రో-గ్రేడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో ఫొటో, వీడియో క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఈ ఫోన్‌లో గేమ్‌లను కూడా ఆస్వాదించవచ్చు. మీరు ఇప్పుడే అమెజాన్ నుంచి రూ. 42998కు కొనుగోలు చేయవచ్చు.

Read Also : Recharge Plans : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? 365 రోజుల వ్యాలిడిటీ, 600GB డేటా ప్లాన్లు ఇవే.. మీ నెట్‌వర్క్ ఏదైనా..!

రెండు స్టోరేజ్ వేరియంట్లలో 12GB RAM + 256GB, 16GB RAM + 512GB అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ ధర రూ. 44,999 ఉండగా, టాప్ వేరియంట్ రూ. 51,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై, రూ. 3వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ. 4వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను అమెజాన్ సేల్‌లో రూ. 39,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంచింది. కానీ, అసలు ధర రూ. 51,999 ఉండగా, రూ. 12 వేల ధర తగ్గింపుతో లభిస్తోంది.