Amazon Prime Day Sale : కొత్త ఫోన్ కావాలా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ ఇదే.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. గెట్ రెడీ..!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలు కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Amazon Prime Day Sale : కొత్త ఫోన్ కావాలా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్ ఇదే.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. గెట్ రెడీ..!

Amazon Prime Day Sale

Updated On : June 28, 2025 / 12:53 PM IST

Amazon Prime Day Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అతి త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలు కానుంది. ఈ ప్రైమ్ డే సేల్‌ జూలై 12 నుంచి (Amazon Prime Day Sale) అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌కు ముందే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, వేరబుల్ డివైజ్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది.

రాబోయే 3 రోజుల సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 13s, ఐఫోన్ 15, ఐక్యూ నియో 10 మరిన్ని మోడళ్లపై 40శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలుదారులకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు వంటివి లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలు చేయాల్సిన కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ధర రూ.84,999కి తగ్గింది. ఫ్లాట్ 37శాతం తగ్గింపు అందిస్తోంది. ప్రైమ్ డే సేల్ సమయంలో ఈ ఫోన్ రూ.80వేలు లోపు ఉండొచ్చు. ICICI, SBI క్రెడిట్ కార్డులపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాదిలో రూ.1,34,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ 200MP-లీడ్ క్వాడ్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, భారీ బ్యాటరీతో అద్భుతమైన డిస్‌ప్లేను కలిగి ఉంది.

Read Also : Financial Rules July : ఆధార్-పాన్ నుంచి ఐటీఆర్, రైల్వే టికెట్లు, క్రెడిట్ కార్డుల వరకు.. జూలైలో రాబోయే కొత్త ఆర్థిక మార్పులివే..!

ఐఫోన్ 15 :
ఐఫోన్ 15 అసలు ధర కన్నా 14శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. లాస్ట్ జనరేషన్ ఐఫోన్ 15, ప్రైమ్ డే సేల్ సమయంలో 50వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉండవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.1″ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 48MP-లీడ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్ ఉన్నాయి.

వన్‌ప్లస్ 13s 5G ఫోన్ :
వన్‌ప్లస్ 13S ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో అద్భుతమైన డీల్‌ను అందించనుంది. ఈ ఫోన్ ఈ నెల ప్రారంభంలో రూ. 49,999 ధరకు లాంచ్ అయింది. సేల్ సమయంలో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 5850mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మిడ్-రేంజ్ కేటగిరీలో అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఐక్యూ నియో 10 5G :
ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ రూ.33,998కి అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.30వేల లోపు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, 120W ఫ్లాష్‌ఛార్జ్‌తో 7,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.