Financial Rules July : ఆధార్-పాన్ నుంచి ఐటీఆర్, రైల్వే టికెట్లు, క్రెడిట్ కార్డుల వరకు.. జూలైలో రాబోయే కొత్త ఆర్థిక మార్పులివే..!

Financial Rules July : జూలైలో ఆర్థికపరమైన కొత్త మార్పులు రానున్నాయి. పన్నుచెల్లింపుదారులతో పాటు సాధారణ ప్రజలపై ప్రభావం చూపనున్నాయి.

Financial Rules July : ఆధార్-పాన్ నుంచి ఐటీఆర్, రైల్వే టికెట్లు, క్రెడిట్ కార్డుల వరకు.. జూలైలో రాబోయే కొత్త ఆర్థిక మార్పులివే..!

Financial Rules July

Updated On : June 28, 2025 / 12:13 PM IST

Financial Rules July : జూలై 1, 2025 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. వ్యక్తిగత ఆర్థికపరమైన మార్పులు ఉండనున్నాయి. సాధారణ ప్రజలపై భారీగా ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పుల నుంచి భారతీయ రైల్వేల కొత్త తత్కాల్ నియమాల వరకు.. వచ్చే నెలకు సంబంధించిన అన్ని కీలక మార్పులు చాలానే ఉన్నాయి.

ప్రతి నెలా, వ్యక్తులు, గృహాల వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై అనేక ఆర్థిక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం జూలైలో భారతీయ రైల్వేల కొత్త తత్కాల్ టికెట్ నిబంధనల నుంచి GST ఫైలింగ్ మార్పుల వరకు అనేక మార్పులను తీసుకురానుంది. జూలైలో రాబోయే కొన్ని ప్రధాన ఆర్థిక మార్పుల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 వస్తోందోచ్.. జూలై 1నే లాంచ్.. కెమెరా ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చంటే?

కొత్త పాన్‌ కార్డుకు ఆధార్ తప్పనిసరి :
జూలై 1, 2025 నుంచి కొత్త పాన్ (PAN) కార్డు పొందడానికి ఆధార్ తప్పనిసరి అవుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొత్త రూల్ ప్రకారం.. కొత్త పాన్ కార్డ్ తీసుకునే వారు ఆధార్ నంబర్ కలిగి ఉండాలి. ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. ప్రస్తుతం, పాన్ కార్డు పొందడానికి ఏదైనా వ్యాలీడ్ ఐడెంటిటీ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అవసరం.

అక్టోబర్ 1, 2024 లేదా అంతకుముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో ఆధార్ ఉంటే.. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 31, 2025 మాత్రమే. గడువు తర్వాత పాన్ పనిచేయదు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ఒక పాన్ కార్డును మాత్రమే కలిగి ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డు కలిగి ఉంటే రూ. 10వేలు జరిమానా విధించవచ్చు.

తత్కాల్ టికెట్ రూల్స్ :
జూలై 1 నుంచి ఆధార్ అథెంటికేషన్ వినియోగదారులు మాత్రమే IRCTC అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోగలరని రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. జూలై 15 నుంచి తత్కాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఆధార్ ఆధారిత OTP అథెంటికేషన్ తప్పనిసరి అవుతుంది. “01-07-2025 నుంచి తత్కాల్ పథకం కింద టిక్కెట్లను ఆధార్ అథెంటికేషన్ యూజర్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకోగలరు” అని మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లో తెలిపింది.

కొత్త నిబంధన ప్రకారం.. ప్రజలు తత్కాల్ టిక్కెట్లను ఈజీగా బుకింగ్ చేసుకోగలరు. ఏజెంట్లు ఈ తత్కాల్ టిక్కెట్లను అనైతికంగా బ్లాక్ చేయకుండా నిరోధించవచ్చు. అదనంగా, జూలై 15 నుంచి కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లలో అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న తత్కాల్ టిక్కెట్లకు OTP అథెంటికేషన్ అవసరం అవుతుంది.

వినియోగదారులు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకున్న సమయంలో అందించిన ఫోన్ నంబర్ ద్వారా అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో మాత్రం ఆధార్ అథెంటికేషన్ అవసరం ఉండదని గమనించాలి.

అధీకృత ఏజెంట్ల ద్వారా రైల్వే బుకింగ్‌లు :
భారత రైల్వేలు అధికారం ఇచ్చిన ఏజెంట్లు బుకింగ్ విండో ఓపెన్ చేశాక మొదటి 30 నిమిషాలలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోలేరు. ఈ అధీకృత ఏజెంట్లు ఉదయం 10:00 నుంచి 10:30 గంటల మధ్య ఎయిర్ కండిషన్డ్ క్లాస్ తత్కాల్ టిక్కెట్లు, ఉదయం 11:00 నుంచి ఉదయం 11:30 గంటల వరకు నాన్-AC క్లాస్ టిక్కెట్లను బుక్ చేసుకోకుండా నిషేధించింది. ఈ రూల్ జూలై 15 నుంచి కూడా అమల్లోకి వస్తుంది.

రైలు ఛార్జీలు :
జూలై 1, 2025 నుంచి టికెట్ ధరలను స్వల్పంగా సవరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. జూన్ 24న మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులకు కిలోమీటరుకు ఒక పైసా, అన్ని ఏసీ తరగతులకు కిలోమీటరుకు రెండు పైసల పెంపును రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

ఇది అమల్లోకి వస్తే.. జనవరి 2020లో కోవిడ్-19 తర్వాత రైలు ఛార్జీలలో ఇదే మొదటి సవరణ కానుంది. 2020, 2013లో జరిగిన గత ఛార్జీల సవరణలతో పోలిస్తే.. ప్రస్తుత పెరుగుదల అత్యల్పంగా ఉండొచ్చు.

జనవరి 2020లో రైల్వేలు జనరల్ సెకండ్ క్లాసు టిక్కెట్లకు కి.మీ.కు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ సెకండ్ క్లాస్ టిక్కెట్లకు 2 పైసలు పెంచాయి. నివేదిక ప్రకారం.. ఈ పెంపుదల అమలైతే మిగిలిన ఆర్థిక సంవత్సరం 2025-26కి రూ. 700 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. పూర్తి ఆర్థిక సంవత్సరం 2026కి రూ. 920 కోట్లకు పైగా అదనపు ఆదాయం ఉంటుందని అంచనా.

GST మార్పులివే :
వస్తువులు, సేవల పన్ను నెట్‌వర్క్ (GSTN) నెలవారీ GST పేమెంట్ (GSTR-3B) ఫారమ్ జూలై 2025 నుంచి నాన్ ఎడిటబుల్ ఫారంగా అందుబాటులో ఉంటుంది. ఇందులో GSTR-1/ GSTR-1A/ IFFలో పన్ను బాధ్యత అనేది ఆటోమాటిక్‌గా ఫిల్ అవుతుంది. అంటే.. నెలవారీ GST పేమెంట్లకు సంబంధించిన GSTR-3B ఫారంలో పన్ను చెల్లింపుదారులు ఇకపై ఎలాంటి మార్పులు చేయలేరు.

Read Also : Credit Card Rule : బిగ్ అలర్ట్.. జూలైలో క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. SBI, HDFC, కోటక్ కస్టమర్లు తప్పక తెలుసుకోండి.. కీలక మార్పులు ఇవే..!

పన్ను చెల్లింపుదారులు ఫైలింగ్ చేసిన గడువు తేదీ నుంచి 3 ఏళ్ల తర్వాత నెలవారీ, వార్షిక GST రిటర్న్‌లను దాఖలు చేయలేరని GSTN అడ్వైజరీలో తెలిపింది. GSTR-1, GSTR 3B, GSTR-4, GSTR-5, GSTR-5A, GSTR-6, GSTR 7, GSTR 8, GSTR 9 ఫారాలను దాఖలు చేయలేరు. పన్ను చెల్లింపుదారులు తమ రికార్డులను సరిచేసుకుని, ఇప్పటివరకు దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా తమ GST రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, రివార్డ్ పాయింట్లలో జూలై 1 నుంచి భారీగా మార్పులు అమల్లోకి రానున్నాయి. వాలెట్ లోడింగ్ (రూ. 10వేల కన్నా ఎక్కువ), యుటిలిటీ చెల్లింపులు (రూ. 50వేలు కన్నా ఎక్కువ), ఆన్‌లైన్ గేమింగ్ లావాదేవీలు (రూ. 10వేల కన్నా ఎక్కువ)పై 1 శాతం ఛార్జీని బ్యాంక్ ప్రవేశపెట్టింది.

ఈ ఒక శాతం ఛార్జ్ నెలకు గరిష్టంగా రూ. 4,999కి పరిమితం అయింది. ఇంకా, అన్ని అద్దె పేమెంట్లు (మొత్తంతో సంబంధం లేకుండా) రూ. 15వేల కన్నా ఎక్కువ ఫ్యూయల్ పేమెంట్స్, థర్డ్ పార్టీ దరఖాస్తుల ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్లపై కూడా ఒక శాతం ఛార్జ్ ఉంటుంది.

బ్యాంక్ రివార్డ్ పాయింట్ విధానాన్ని కూడా బ్యాంకు సవరించింది. జూలై 1 నుంచి ఆన్‌లైన్ స్కిల్స్ ఆధారిత గేమింగ్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు ఉండవు. బీమా రివార్డ్ పాయింట్ పరిమితులు మారనున్నాయి. రోజువారీ పరిమితులకు బదులుగా నెలవారీ పరిమితులు ఉంటాయి.

ఐటీఆర్ గడువు పొడిగింపు :
ఈ ఆర్థిక సంవత్సరానికి పన్ను దాఖలు గడువు జూలై 31 కాదని గమనించాలి. ఈ ఏడాది ఐటీఆర్ ఫారమ్‌లలో అనేక మార్పుల కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరం, 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది.