Amul Prices : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. అమూల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. చౌకగా మారిన నెయ్యి, వెన్న, ఐస్ క్రీం సహా 700 ఉత్పత్తులు.. కొత్త ధరలివే..!

Amul Products Price Cut : ఐస్ క్రీం, చాక్లెట్, వెన్న, చీజ్, పన్నీర్ సహా 700 కి పైగా ఉత్పత్తులపై అమూల్ ధరలను తగ్గించింది.

Amul Prices : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. అమూల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. చౌకగా మారిన నెయ్యి, వెన్న, ఐస్ క్రీం సహా 700 ఉత్పత్తులు.. కొత్త ధరలివే..!

Amul Products Price Cut

Updated On : September 21, 2025 / 3:54 PM IST

Amul Products Price Cut : అమూల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అమూల్ ప్రొడక్టుల ధరలు భారీగా తగ్గనున్నాయి. అతి చౌకైన ధరకే లభించనున్నాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమూల్ బ్రాండ్ కింద విక్రయించే 700కి పైగా ఉత్పత్తుల రిటైల్ ధరలలో మార్పులను ప్రకటించింది. వినియోగదారులకు జీఎస్టీ 2.0 పూర్తి ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ రేటు తగ్గింపు తర్వాత అమూల్ వెన్న ఉత్పత్తుల ధరల్లో భారీ సవరణ జరిగింది.

వెన్న, నెయ్యి, చీజ్, పన్నీర్, చాక్లెట్లు, బేకరీ వస్తువులు, ఫ్రోజెన్ స్నాక్స్ వంటి 700 కన్నా (Amul Products Price Cut) ఎక్కువ ఉత్పత్తుల ప్యాక్‌ల ధరలు గణనీయంగా తగ్గాయి. నివేదికల ప్రకారం.. అమూల్ ఐస్ క్రీం, చాక్లెట్లు, వెన్న, జున్ను, పన్నీర్ భారీ తగ్గింపు ధరకే లభించనున్నాయి. అమూల్ ఉత్పత్తుల కొత్త ధరలను తెలుసుకునేందుకు వినియోగదారుల కోసం ఒక పోర్టల్‌ను కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఐస్ క్రీం, ఇతర పాల ఉత్పత్తుల ధరలలో భారీగా తగ్గనున్నాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి.

రోజువారీ నిత్యావసర వస్తువులకు, అముల్ వెన్న (100 గ్రాములు) ధర రూ.62 నుంచి రూ.58కి తగ్గింది. అయితే, 500 గ్రాముల ప్యాక్ ఇప్పుడు రూ.305కి బదులుగా రూ.285కి లభించనుంది. నెయ్యి ధరలు బాగా తగ్గాయి. ఒక లీటర్ కార్టన్ రూ.40 తగ్గి రూ.610కి, 5 లీటర్ టిన్ రూ.200 తగ్గి రూ.3,075కి చేరుకుంది. జీఎస్టీ రేటు తగ్గింపుతో అముల్ పాల ధరలు కూడా సరసమైనవిగా మారాయి. అముల్ తాజా టోన్డ్ మిల్క్ (1L UHT) రూ. 77 నుంచి రూ. 75కి, అముల్ గోల్డ్ (1L UHT) రూ. 83 నుంచి రూ. 80కి తగ్గాయి.

ఫ్రోజెన్ వస్తువుల ధరలు భారీగా తగ్గింపు :
ఫ్రోజెన్, ప్రాసెస్ చేసిన వస్తువుల ధర కూడా భారీగా తగ్గింది. ఫ్రోజెన్ పనీర్ (200గ్రా) ధర ఇప్పుడు రూ.99 నుంచి రూ.95కి తగ్గింది, ప్రాసెస్ చీజ్ (కిలో బ్లాక్) ధర రూ.30 తగ్గి రూ.545కి చేరుకుంది. చీజ్ క్యూబ్స్ (200గ్రా), డైస్డ్ చీజ్ బ్లెండ్ (200గ్రా) వంటి చిన్న ప్యాక్‌లు వరుసగా రూ.9, రూ.14 తగ్గాయి.

Read Also : GST Rate Cut : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. మధ్యతరగతికి బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి చౌకగా మారే వస్తువులివే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

చౌకగా అమూల్ ఐస్ క్రీం, వెన్న ధరలు :

గతంలో రూ. 195 ఖరీదైన లీటర్ టబ్ అముల్ ఐస్ క్రీం ఇప్పుడు రూ. 180కి లభిస్తుంది. ఈ ఉత్పత్తులన్నింటిపై జీఎస్టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గుతుంది. 150 గ్రాముల అముల్ డార్క్, మిల్క్ చాక్లెట్ బార్ ఇప్పుడు రూ.200కి బదులుగా రూ.180కి లభిస్తుంది. అదేవిధంగా, 500 గ్రాముల అముల్ వెన్న ధర రూ. 305 నుంచి రూ.285కు తగ్గుతుంది. 5 లీటర్ల నెయ్యి ఇప్పుడు రూ. 3,275 నుంచి రూ. 3,075కు తగ్గింది.

ఎందుకంటే.. ఈ వస్తువులపై జీఎస్టీ 12శాతం నుంచి 5శాతానికి తగ్గుతుంది. అముల్ పనీర్ రేంజ్ జీఎస్టీ ఇప్పుడు పూర్తిగా తొలగించింది. దాంతో 5శాతం చౌకగా మారుతుంది. ఉదాహరణకు.. ఒక కిలో అముల్ మలై పనీర్ రూ.15 చౌకగా మారుతుంది. అముల్ చీజ్ బ్లాక్ (1 కిలో) ధర కూడా రూ. 30 తగ్గుతుంది. అముల్ మిఠాయి మేట్ (400 గ్రాముల టిన్) సహా ప్రత్యేక వస్తువులు కూడా చౌకగా లభిస్తాయి.

రూ.10 తగ్గింపుతో ధర రూ.120కి చేరుకుంది. ఫ్రోజెన్ స్నాక్స్‌లో అముల్ ఫ్రెంచ్ ఫ్రైస్ (1.25 కిలోలు) రూ.405 నుంచి రూ.365కి తగ్గాయి. దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీదారులు, అమూల్ పార్లర్లు, రిటైలర్లు వంటి వ్యాపార భాగస్వాములకు కొత్త ధరలపై అమూల్ ఇప్పటికే సమాచారం అందించినట్టు నివేదిక తెలిపింది.

ఐస్ క్రీం, జున్ను, వెన్న వినియోగానికి ప్రోత్సాహం :
“వెన్న, నెయ్యి, యూహెచ్‌టీ పాలు, ఐస్ క్రీం, చీజ్, పన్నీర్, చాక్లెట్లు, బేకరీ, ఫ్రోజెన్ డైరీ, పొటాటో స్నాక్స్, కండెన్స్డ్ మిల్క్, గ్రౌండ్ నట్ స్ప్రెడ్, మాల్ట్ ఆధారిత పానీయాలు మొదలైన ఉత్పత్తులన్నింటికీ ఈ మార్పు వర్తిస్తుంది. 3.6 మిలియన్ల మంది రైతులకు చెందిన సహకార సంస్థగా అమూల్ ధరల తగ్గింపుతో పాల ఉత్పత్తుల వినియోగంలో ముఖ్యంగా ఐస్ క్రీం, జున్ను, వెన్న వినియోగాన్ని పెంచుతుందని విశ్వసిస్తోంది. దేశంలో తలసరి వినియోగం ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారుల ఆదాయంలో ఎక్కువ వాటా ఉత్పత్తిదారునికి చేరుతుంది. ఉత్పత్తిదారులు, వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరుస్తుంది” అని ప్రకటనలో పేర్కొంది.