తెలంగాణ వ్యాపారవేత్త బోయినపల్లి అనిల్‌కు అమెరికా అవార్డు

అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పాటు పడిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఇందులో తెలుగువారైన బోయినపల్లి అనిల్ కూడా ఉండడం విశేషం.

తెలంగాణ వ్యాపారవేత్త బోయినపల్లి అనిల్‌కు అమెరికా అవార్డు

Anil Boinapalli : అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న తెలంగాణ వ్యాపారవేత్త బోయినపల్లి అనిల్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండియన్ అమెరికన్ 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయన దక్కించుకున్నారు. నేషనల్ స్మాల్ బిజినెస్ వీక్(ఎన్ఎస్ బీడబ్ల్యూ) అవార్డు 2024కు ఎంపికైన వారిని యునైటెడ్ స్టేట్స్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎస్ బీఏ) ప్రకటించింది. ఇందులో తెలుగువారైన బోయినపల్లి అనిల్ కూడా ఉండడం విశేషం. అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పాటు పడిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 28, 29 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకుంటారు.

స్కై సొల్యుషన్స్ కంపెనీ కోఫౌండర్, సీఈవోగా ఉన్న బోయినపల్లి అనిల్.. వర్జీనియా స్టేట్ నుంచి ఈ అవార్డుకు సెలక్టయ్యారు. వర్జీనియాలోని హెర్న్ డాన్ సంస్థతో కలిసి స్కై సొల్యుషన్స్ కంపెనీని 2008లో ఆయన స్థాపించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అంచెలంచెలుగా ఎదిగారు. తనకు అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు రావడం బోయినపల్లి అనిల్ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: ఫ్రీ హలీమ్ కోసం ఎగబడ్డ జనం.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. వీడియో వైరల్