Ola Experience Centre: ఏపీవాసులకు అందుబాటులో మరో ఓలా ఎక్స్‭పీరియన్స్ సెంటర్.. అనంతపురంలో మొదటి సెంటర్ ప్రారంభం

భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత వేగవంతం చేస్తూ, కంపెనీ తన ‘లవ్ ఆన్ 2 వీల్స్’ ప్రచారంతో ఓలా ఎస్1 ప్రోపై రూ.12,000 తగ్గింపు, దాని హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌కు ఒక ఏడాది పాటు ఉచిత యాక్సెస్‌తో సహా ప్రత్యేకమైన ఆఫర్‌లను విడుదల చేసింది. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు

Ola Experience Centre: ఏపీవాసులకు అందుబాటులో మరో ఓలా ఎక్స్‭పీరియన్స్ సెంటర్.. అనంతపురంలో మొదటి సెంటర్ ప్రారంభం

Another Ola Experience Center available to AP residents.. First center opening in Anantapur

Updated On : February 22, 2023 / 5:31 PM IST

Ola Experience Centre: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, అనంతపురంలోని రుద్రంపేటలోని కళ్యాణదుర్గం రోడ్‌లో కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఓలాకు ఇప్పటికే ఇటువంటి 200 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. కంపెనీ తన నెట్‌వర్క్‌ను మార్చి 2023 నాటికి 500 అవుట్‌లెట్‌లను చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలో పలు చోట్ల ఈ కేంద్రాలు ఇప్పటికే ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో మొదటి సెంటర్ ప్రారంభమైంది. ఇక అనంతపురం కేంద్రంగా డీ2సీ ఫుట్‌ప్రింట్‌ను విస్తరించనున్నట్లు ఓలా ప్రకటించింది.

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి..

అన్ని సేవలను ఒకే చోట అందించాలన్న లక్ష్యంతో, ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో ఈవీ ఔత్సాహికులు ఓలా అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈవీ సాంకేతికత వివరాలు తెలుసుకునేందుకు, వాటి పనితీరును సొంతంగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. వినియోగదారులు ఎస్ 1, ఎస్1 ప్రో టెస్ట్ రైడ్‌లను చేయడంతో పాటు ఓలా బ్రాండ్ ఛాంపియన్‌ల నుంచి కొనుగోలుకు సహకారాన్ని అందుకునేందుకు సహకరిస్తుంది. ఇక ఫైనాన్సింగ్ ఎంపికల వివరాలు తెలుసుకునేందకు, ఓలా యాప్‌లో వారి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా అనుమతిస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు అన్ని పోస్ట్ సేల్స్ కేర్, ఓలా స్కూటర్‌ల నిర్వహణ కోసం వన్-స్టాప్ డెస్టినేషన్లుగా రెండింటి పనితీరును అందిస్తాయి.

Bihar: తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో ఆపించేసిన నితీశ్ కుమార్.. కారణం ఏంటంటే?
భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను మరింత వేగవంతం చేస్తూ, కంపెనీ తన ‘లవ్ ఆన్ 2 వీల్స్’ ప్రచారంతో ఓలా ఎస్1 ప్రోపై రూ.12,000 తగ్గింపు, దాని హైపర్‌చార్జర్ నెట్‌వర్క్‌కు ఒక ఏడాది పాటు ఉచిత యాక్సెస్‌తో సహా ప్రత్యేకమైన ఆఫర్‌లను విడుదల చేసింది. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. అలాగే, రూ.2,499 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐలను ఎంచుకోవచ్చు, 8.99% నుంచి తగ్గిన వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ రుసుమును పొందవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై అదనపు తగ్గింపులను పొందవచ్చు. వీటితో పాటు, వినియోగదారులు తమ పెట్రోల్ స్కూటర్‌లను సరికొత్త ఓలా ఎస్1ల కోసం ఎక్ఛేంజ్ చేసుకునే అవకాశంతో పాటు రూ.4,000 వరకు బోనస్‌ను పొందవచ్చు. ఓలా ప్రస్తుత వినియోగదారులు ఓలా మనీలో రూ.6,000 వరకు పొందడం ద్వారా #EndICEage రెఫరల్ ప్రోగ్రామ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.

TSRTC: ఒడిశా-తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం.. ఇరు రాష్ట్రాల మధ్య 23 బస్సులు
ఓలా ఇటీవలే ‘ఓలా కేర్’ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది తన సర్వీస్ నెట్‌వర్క్‌కు 360 డిగ్రీల యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది వినియోగదారులకు వారి ఇంటి వద్ద లేదా వారికి సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో అందుకునేందుకు అనుమతిస్తుంది. ఓలా కేర్, ఓలా కేర్+ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా, కస్టమర్‌లు ఇంట్లో ఉన్నా లేదా మారుమూల ప్రాంతంలో ఉన్నా సమగ్రమైన సేవ, సహాయ కవరేజీని కూడా కంపెనీ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు ఎస్1, ఎస్1 ప్రో రెండింటికీ ఓలా కేర్+ సబ్‌స్క్రిప్షన్‌పై 50% వరకు తగ్గింపును పొందువచ్చని సంస్థ పేర్కొంది.