Apple Imagine Reseller : ఏయ్ బిడ్డా.. ఇది ఆపిల్ అడ్డా.. ఢిల్లీ ఆపిల్ స్టోర్ ఇన్.. రీసెల్లర్ ఇమాజిన్ స్టోర్ ఔట్.. అసలేం జరిగిందంటే?
Apple Imagine Reseller : ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ మాల్‌లో ఆపిల్ స్టోర్ (Apple Delhi Store) ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఆపిల్ ఇమాజిన్ రీసెల్లర్ షాప్ (Apple Imagine Reseller) మూతపడింది. అసలేం జరిగిందంటే?

Apple Imagine reseller asked to shut at Delhi's Select City Mall days after Saket Apple Store launch
Apple Imagine Reseller : న్యూఢిల్లీలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌లో ప్రపంచ ఐకానిక్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత స్టోర్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే.. కంపెనీ ప్రీమియం రీసెల్లర్ (Apple Imagine Reseller) మాల్‌లోని తన అవుట్‌లెట్‌ను మూసివేసింది. ఆపిల్ మాల్ మేనేజ్‌మెంట్‌తో కలిసి 20 మంది రీసెల్టర్ల లిస్టును అందించింది. దేశ రాజధానిలోని కంపెనీ షోరూమ్ సమీపంలో ఇతర స్టోర్లను ఓపెన్ చేయడాన్ని నిషేధించింది. ఆపిల్ స్టోర్ రీసెల్లర్ కన్నా ఎక్కువ ప్రొడక్టులను విక్రయిస్తుందని, మాల్ లోపల ఆపిల్‌ను విక్రయించే మరో కంపెనీ అవసరం లేదని కంపెనీ భావించింది.
2014లో ప్రారంభమైన ఇమాజిన్ స్టోర్..
ఇందులో భాగంగానే.. మాల్ ఆపరేటర్ ఇమాజిక్ స్టోర్ కంపెనీ లీజును పొడిగించరాదని నిర్ణయించింది. ఆపిల్ తమ ప్రొడక్టులను విక్రయించడంతో పాటు డిస్కౌంట్లను అందించే 24 రీసెల్లర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. 2014లో ఇదే మాల్‌లో ఇమాజిన్ స్టోర్ ప్రారంభమైంది. ఆపిల్ పార్టనర్ రీసెల్లర్లలో ఇమాజిన్ కంపెనీ ఒకటి. అయితే, ఇప్పుడు ఆపిల్ సొంత స్టోర్ ఓపెన్ చేయడంతో.. ఇమాజిన్ స్టోర్ లీజును ఇక పొడిగించబోమని మాల్ నిర్వాహకులు కంపెనీకి తెలిపారు.
Read Also : Apple Jobs in India : భారత్‌లో లక్షకు పైగా ఆపిల్ ఉద్యోగాలు.. 72 శాతం మంది మహిళలే.. ఎందుకో తెలుసా?
రిటైలర్లు సాధారణంగా 9ఏళ్ల లీజును కలిగి ఉంటారు. ప్రతి మూడు సంవత్సరాలకు వారి అద్దెలను పెంచుతారు. 2014లో స్టోర్ ప్రారంభించినప్పటి నుంచి ఇమాజిన్ స్టోర్ లీజు ముగింపు దశకు చేరుకుంది. ఆపిల్ తన ఆపిల్ స్టోర్‌ను దేశ రాజధానిలో మరో ప్రాంతంలో తెరవాలని ఎంచుకుంటే ఈ స్టోర్ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని నివేదిక తెలిపింది.

Apple Imagine reseller asked to shut at Delhi’s Select City Mall days after Saket Apple Store launch
ఈ 22 బ్రాండ్లకు నో ఎంట్రీ బోర్డు.. :
సిటీ వాక్ మాల్ జూలై 2022లో Appleతో లీజుపై సంతకం చేసింది. ఆపిల్ స్టోర్ సమీపంలో ఎక్కడా కూడా ఇతర పోటీదారుల్లో 22 బ్రాండ్‌లు తమ స్టోర్ ఓపెన్ చేయరాదని లీజులో ఆపిల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో Amazon, Bose, Devialet, Facebook, Foxconn, Alphabet/Google, Huawei, Intel, Lenovo, LG, Microsoft, Nest, Nokia, Panasonic, Samsung, Sony, Vivo, Xiaomi, Oppo, OnePlus వంటి కంపెనీలు ఉన్నాయి.
సాకేత్ ఆపిల్ స్టోర్‌ను ఈ నెల ప్రారంభంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (CEO Tim Cook) ప్రారంభించారు. ముందుగా ముంబై స్టోర్‌ను ప్రారంభించిన ఆయన రెండో స్టోర్ ఢిల్లీలో ప్రారంభించారు. 25 ఏళ్ల ఆపరేషన్‌లో ఆపిల్ భారత మార్కెట్లో తన స్టోర్లను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఆపిల్ స్టోర్‌లో 15 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడే 70 మంది నైపుణ్యం కలిగిన ఉన్నత విద్యావంతులైన సేల్స్ టీమ్ సభ్యులు ఉన్నారు.
Read Also : Apple Delhi Store : ఏప్రిల్ 20న ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలివే..!