Apple iPhones Offers : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు..!
Apple iPhones Offers : ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సమయంలో రూ.61,999 ప్రారంభ ధరతో జాబితా అయింది. 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర అధికారిక రిటైల్ ధర రూ. 79,900 నుంచి తగ్గింది.

Apple iPhone 14 Plus, 15 Pro And 15 Pro Max ( Image Credit : Google )
Apple iPhones Offers : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. అనేక ఐఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్రో మరిన్ని వంటి ఫోన్లపై బ్యాంక్ ఆఫర్‌లతో పాటు భారీ ఫ్లాట్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే అందుబాటులో ఉంది. జూన్ 8 వరకు కొనసాగుతుంది. ఈ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 14 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సమయంలో రూ.61,999 ప్రారంభ ధరతో జాబితా అయింది. 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర అధికారిక రిటైల్ ధర రూ. 79,900 నుంచి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ధరను రూ. 17,901 తగ్గించింది. ఐఫోన్ 14 డివైస్‌ని కొనుగోలు చేయొచ్చు. అయితే, ప్లస్ మోడల్‌తో పొందుతున్న డిస్‌ప్లే, బ్యాటరీ కొంచెం పెద్దదిగా ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈఎంఐ ఆప్షన్లపై 10 శాతం తగ్గింపుతో సహా కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. సాధారణ ఐఫోన్ 14 మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే యూజర్లు రూ. 56,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ, యూజర్లు కొంచెం ఎక్కువ ఖర్చు చేయగలిగితే.. ఐఫోన్ 15ను కొనుగోలు చేయొచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించవచ్చు. ఈ ఐఫోన్ ధరను పెద్ద మార్జిన్‌తో తగ్గించే అవకాశం ఉంది.
ఐఫోన్ 15 సిరీస్ ధర ఎంతంటే? :
ఆపిల్ ఐఫోన్ 15 వేగవంతమైన పర్ఫార్మెన్స్, ఐఫోన్ 14పై మెరుగైన కెమెరా షాట్‌లను అందిస్తుంది. అయితే, మీరు ఐఫోన్ 15ప్రో మోడల్‌లతో అన్నింటిలో బెస్ట్ ఫీచర్లను పొందవచ్చు. కానీ, సాధారణ ఐఫోన్ 15 మోడల్ కూడా ధర పరిధిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచింది. దీని ధర ఇప్పుడు రూ. 70,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభ ధర రూ. 79,900 కన్నా తక్కువగా ఉంటుంది. ఐఫోన్ యూజర్లు రూ. 8,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 4వేలు అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఐఫోన్ ధరను రూ.66,999కి తగ్గిస్తుంది. ప్రస్తుత ఐఫోన్ మరింత ఎక్కువ తగ్గింపుల కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు రూ.1,27,990 వెచ్చించాల్సి ఉంటుంది. అసలు ధర రూ. 1,34,900 నుంచి తగ్గింది. అదేవిధంగా, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,48,900కి విక్రయిస్తోంది. ఈ ఐఫోన్ ప్రారంభ ధర రూ. 1,59,900 కన్నా తక్కువగా ఉంటుంది. సాధారణ ప్రో మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. మీరు రెండింటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ పొందవచ్చు. ఐఫోన్ ప్రో మాక్స్‌లో కొంచెం భారీ బ్యాటరీతో డిస్‌ప్లే మాత్రమే ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంది. సాధారణ ప్రో వెర్షన్‌లో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంది. ఈ రెండు ఐఫోన్లలో మిగిలిన స్పెషిఫికేషన్లు ఒకేలా ఉంటాయి.
Read Also : Aadhaar Update Online : మీ ఆధార్ అప్‌డేట్ చేయలేదా? ఇంకా కొద్దిరోజులే.. ఈ తేదీలోగా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి!