Flipkart Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్..!
Flipkart Diwali Sale : ఈ దీపావళి పండుగ సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 ధర చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ అక్టోబర్ 20 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.

Apple iPhone 15 can be bought for under Rs 50,000 (Image Source : Google )
Flipkart Diwali Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. మీరు ఐఫోన్ 15 కొనేందుకు చూస్తుంటే ఇదే సరైన సమయం. ఐఫోన్ 15 ధర ఈ దీపావళి పండుగ సమయంలో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ అక్టోబర్ 20 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.
సాధారణంగా ఐఫోన్ 15 మోడల్‌పై రూ. 66,900 ధర వద్ద బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ డీల్‌ల సాయంతో రూ. 50వేల లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై బ్యాంక్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లతో రూ. 66,900 ధరతో ఆకర్షణీయమైన తగ్గింపు పొందవచ్చు. కొంతమంది కొనుగోలుదారులు ఈ ఐఫోన్ 15 ధరను రూ. 50వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌లు :
ఆపిల్ ఐఫోన్ 15 విషయానికి వస్తే.. ఐఫోన్ ఎ16 బయోనిక్ చిప్ ద్వారా అందిస్తుంది. మీరు గేమింగ్ చేసినా, మల్టీ టాస్కింగ్ చేసినా లేదా ఇంటెన్సివ్ యాప్‌లను ఉపయోగిస్తున్నా స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఐఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. వీడియోలను చూసేందుకు లేదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్క్రోలింగ్ చేసేందుకు సరైనదిగా చెప్పవచ్చు.
కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 15 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాను అందిస్తుంది. తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. 12ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా సెల్ఫీలకు లేదా వీడియో కాల్స్ చేయొచ్చు. 5జీకి కూడా సపోర్టు అందిస్తుంది. అదనంగా, రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మీ ఫోన్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా టాప్ అప్ చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.