iPhone 16 Plus : ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ అదుర్స్.. ఐఫోన్ 16 ప్లస్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇంత తక్కువలో వస్తుంటే కొనాల్సిందే..!
iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 10వేల కన్నా ఎక్కువ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 16 Plus
iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. బిగ్ స్క్రీన్‌తో కొత్త ఐఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ప్రస్తుతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో కస్టమర్లు రూ. 10వేల కన్నా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
రూ. 89,900 (128GB) ధరతో ఈ ఐఫోన్ 15 ప్లస్ OLED ప్యానెల్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ధర డీల్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ధర :
ప్రస్తుతం ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900 నుంచి రూ.79,999కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై కస్టమర్లు 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా మొత్తం రూ.10వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. ఆసక్తి గల కొనుగోలుదారులు నెలకు రూ.2,813 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలుదారులు పాత ఫోన్ ద్వారా ఐఫోన్ 16 ప్లస్ కోసం ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్లు, మోడల్, వేరియంట్‌ను బట్టి రూ.60,200 వరకు వాల్యూను పొందవచ్చు. కస్టమర్లు బ్లాక్, వైట్, రోజ్, టీల్, అల్ట్రామెరైన్ కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లించడం ద్వారా (AppleCare Protect+), ఎక్స్‌టెండెడ్ వారంటీని యాడ్-ఆన్‌గా ఎంచుకోవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ OLED ప్యానెల్‌ను 60Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. A18 చిప్‌సెట్ నుంచి పవర్ పొందుతుంది. 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.
ఈ ఐఫోన్ IP68 డస్ట్, వాటర్ నిరోధకతను కలిగి ఉంది. iOS 18.4పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇందులో విజువల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కెమెరా కంట్రోల్స్ కూడా ఉన్నాయి.