OTT స్ట్రీమింగ్ వార్ : నెలకు రూ.99లకే Apple TV+ Liveలో చూడొచ్చు

ఇప్పుడంతా OTT సర్వీసులదే ట్రెండ్. ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫాం సర్వీసులు అందించే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, జీ5, అల్ట్ బాలాజీ, జియో సినిమాలకు పోటీగా ఆపిల్ కొత్త స్ట్రీమింగ్ సర్వీసులను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చిలోనే Apple TV+ స్ట్రీమింగ్ సర్వీసును లాంచ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా 100 దేశాల్లో ఆపిల్ టీవీ ప్లస్ సర్వీసును ప్రారంభించింది.
ఇతర ఓటీటీ పోటీదారులకు ధీటుగా సొంత ఒరిజినల్ షోలు, మూవీ కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఆపిల్ 6 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టినట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆకర్షణీయ మార్కెట్ ఉన్న ఇండియానే లక్ష్యంగా ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్ అందించేందుకు ఆపిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం FY2023 నాటికి ఇండియాలో 500 మిలియన్లకు పైగా ఆన్ లైన్ వీడియో సబ్ స్ర్కైబర్లకు చేరాలని కంపెనీ అంచనా వేస్తోంది.
మిగతా స్ట్రీమింగ్ సర్వీసుల కంటే దూకుడుగా ముందుకు వెళ్తున్న ఆపిల్ కంపెనీ.. నెలవారీ సబ్ స్ర్కిప్షన్ కింద రూ.99లకే Apple TV+ స్ట్రీమింగ్ సర్వీసును ఆఫర్ చేస్తోంది. తద్వారా ఇండియాలో అతిపెద్ద మార్కెట్ సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తోంది.
అదే అమెరికాలో నెలకు 4.99 డాలర్లగా ఉంది. ప్రారంభ ఆఫర్ల కింద ప్రతిఒక్క యూజర్ కు 7 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేస్తోంది. కొత్త ఆపిల్ డివైజ్ సహా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ టీవీ లేదా ఐప్యాడ్ టచ్ లు కొనుగోలుచేసినవారికి ఏడాది సబ్ స్ర్కిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
ఆపిల్ TV+ సబ్ స్ర్కిప్షన్ ద్వారా ఆపిల్ ఐడీ, పాస్ వర్డ్ కలిగిన యూజర్.. గరిష్టంగా ఆరుగురు కుటుంబ సభ్యుల వరకు సర్వీసును షేరింగ్ చేసుకోనే వీలుంది. ఆపిల్ TV+ ఒరిజినల్స్ ఆన్ లైన్, ఆఫ్ లైన్, యాడ్ ఫ్రీ, ఆన్ డిమాండ్ అన్నింటిపై అందుబాటులో ఉంది. ఇండియాలోని వివిధ ఆపిల్ డివైజ్ లతో పాటు ఫైర్ టీవీ స్టిక్ పై అందించే ఆపిల్ టీవీ యాప్ పై కూడా ఈ సర్వీసు లైవ్ అయింది.