బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారా? ఏప్రిల్‌లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు

Bank holidays in April 2024: కొన్ని రాష్ట్రాల్లో పండుగల ప్రాధాన్యతలనుబట్టి బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే, కొన్ని..

బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారా? ఏప్రిల్‌లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు

Bank Holidays

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం దాదాపు 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన బ్యాంకుల సెలవుల జాబితా ప్రకారం.. ఏప్రిల్లో ఆదివారాలతో పాటు రెండవ, నాల్గవ శనివారాలు సెలవులు ఉంటాయి. అలాగే, బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, జుమాత్-ఉల్-విదా, ఉగాది, రంజాన్, బోహాగ్ బిహు, శ్రీ రామ నవమి వంటివి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పండుగల ప్రాధాన్యతలనుబట్టి బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో ఉండవు.

  • బ్యాంకులకు సెలవులు
  • ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ప్రారంభం వేళ బ్యాంకులు తమ వార్షిక ఖాతాలను మూసివేయడానికి సెలవు తీసుకుంటాయి. అయినప్పటికీ మిజోరం, చండీగఢ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయాలో ఏప్రిల్ 1న బ్యాంకులు తెరిచే ఉంటాయి
  • ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు/జుమాత్-ఉల్-విదా ఉన్నాయి
  • ఏప్రిల్ :9 గుఢి పడ్వా/ఉగాది/సాజిబు నొంగ్మపాన్బా (చీరవోబా)
  • ఏప్రిల్ 10: రంజాన్-ఈద్ (కేరళలో బ్యాంక్ హాలీడే)
  • ఏప్రిల్ 11: రంజాన్-ఈద్ (చండీగఢ్, సిక్కిం, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం సెలవులు ఉండవు)
  • ఏప్రిల్ 13: బోహాగ్ బిహు/చీరావోబా/బైసాఖీ/బిజు పండుగ
  • ఏప్రిల్ 15: బోహాగ్ బిహు/హిమాచల్ డే
  • ఏప్రిల్ 17: శ్రీ రామ నవమి
  • ఏప్రిల్ 20: గరియా పూజ

 

  • సాధారణంగా ఉండే సెలవులు
  • ఏప్రిల్ 7: ఆదివారం
  • ఏప్రిల్ 13: రెండవ శనివారం (బోహాగ్ బిహు కూడా)
  • ఏప్రిల్ 14 : ఆదివారం
  • ఏప్రిల్ 21: ఆదివారం
  • ఏప్రిల్ 27: నాలుగో శనివారం
  • ఏప్రిల్ 28: ఆదివారం

Also Read: శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ కొత్త 5జీ ఫోన్లు వచ్చేశాయి.. ఈ ఫోన్ల ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?