Best Laptops in India : భారత్‌లో రూ.40వేల లోపు ధరలో 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

Best Laptops in India : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రూ. 40వేల బ్రాకెట్‌లో అద్భుతమైన (Best Laptops) ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. గేమింగ్-సెంట్రిక్ ల్యాప్‌టాప్‌లు (Gaming Laptops) మరింత ఖరీదైనవిగా ఉంటాయి. తక్కు ధరలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.

Best Laptops in India : భారత్‌లో రూ.40వేల లోపు ధరలో 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

Best Laptops in India Photo : (Google)

Updated On : April 3, 2023 / 9:19 PM IST

Best Laptops in India : ఏ ల్యాప్ టాప్ కొంటే బెస్ట్.. ఏ బ్రాండ్ ల్యాప్‌టాప్ కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే బెస్ట్ ల్యాప్‌టాప్స్ (Best Laptops) అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 2023 ఎడిషన్‌తో అద్భుతమైన ల్యాప్‌టాప్స్ వచ్చాయి. వివిధ ధరల్లో అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు/స్మార్ట్‌ఫోన్‌లు/TWS ఇయర్‌బడ్‌లు ఉన్నాయి. మీకోసం భారత మార్కెట్లో రూ. 40వేల లోపు బెస్ట్ ఐదు ల్యాప్‌టాప్‌ల జాబితాను అందిస్తున్నాం.

ఈ రేంజ్‌లో (మార్చి 31 నాటికి) ఇంకా లేటెస్ట్-జెన్ ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రాలేదు. గత ఏడాది నుంచి కొన్ని బెస్ట్ నోట్‌బుక్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో అనేక ల్యాప్‌టాప్‌లను ఎంచుకోవచ్చు. గేమింగ్-సెంట్రిక్ ల్యాప్‌టాప్‌లు మరింత ఖరీదైనవిగా ఉంటాయి. క్రియేటర్ల కోసం కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ధర పరిధిలోని చాలా ల్యాప్‌టాప్‌లు 8GB RAMతో వస్తాయని గమనించాలి.

ఆసుస్ వివోబుక్ గో 15 (Asus Vivobook Go 15) :
ఆసుస్ వివోబుక్ (Go 15) అనేది ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇదో ఆల్ రౌండర్ ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్ Full-HD రిజల్యూషన్‌తో 15-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 7వ-జనరేషన్ క్వాడ్-కోర్ AMD రైజెన్ 3 (7320U) CPU ద్వారా అందిస్తుంది.

Best Laptops in India _ April 2023 edition of Best Laptops under Rs 40K in India

Best Laptops in India Photo : (Google)

ఇంటెల్ ఎక్కువ ప్రీమియం 11వ-జనరేషన్ ఇంటెల్ కోర్ i5-1135G7 ప్రాసెసర్‌తో వచ్చింది. Asus ల్యాప్‌టాప్ 8GB LPPDR5 RAM టెక్‌ని కూడా కలిగి ఉంది. DDR4 RAM టెక్ కన్నా ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో Windows 11, 512GB M.2 NVMe PCIe 3.0 SSD, ఇంటిగ్రేటెడ్ AMD రేడియన్ గ్రాఫిక్స్ ఉన్నాయి. Asus ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 39,999గా ఉంది.

Read Also : OnePlus Nord CE 3 : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఇన్ఫినిక్స్ X1 స్లిమ్ (Infinix X1 Slim) :
Infinix ల్యాప్‌టాప్ మార్కెట్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని సాలిడ్ PCలను కంపెనీ తయారు చేస్తోంది. మెటల్ బాడీ, 16GB LPDDR4X RAM (512GB SSD) స్టోరేజ్‌తో వచ్చింది. ఈ సెగ్మెంట్‌లోని అరుదైన ల్యాప్‌టాప్‌లలో ఇదొకటి. లుక్స్ పరంగా Infinix X1 స్లిమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Best Laptops in India _ April 2023 edition of Best Laptops under Rs 40K in India

Best Laptops in India Photo : (Google)

అయినప్పటికీ, 10వ-జనరేషన్ కోర్ i5 CPUతో వస్తుంది. లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్‌ల కన్నా పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండకపోవచ్చు. మీరు వెబ్‌ను బ్రౌజ్ చేసేందుకు, మూవీలను చూడటం, తేలికపాటి గేమింగ్ కోసం పర్సనల్ కంప్యూటర్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. 14-అంగుళాల Full-HD డిస్‌ప్లేతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 38,990గా ఉంది.

రియల్‌మి బుక్ స్లిమ్ (Realme Book Slim) :
Infinix X1 స్లిమ్ మాదిరిగానే.. డిజైన్ మీ ప్రాధాన్యత అయితే.. Realme Book (Slim) బెస్ట్ ఆప్షన్. 1.38kg, Realme Book (స్లిమ్) అత్యంత పోర్టబుల్ అని చెప్పవచ్చు. Apple MacBooks మాదిరిగా ఉంది. గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది.

Best Laptops in India _ April 2023 edition of Best Laptops under Rs 40K in India

Best Laptops in India Photo : (Google)

ల్యాప్‌టాప్ ముఖ్య ఫీచర్లలో 2K QHD రిజల్యూషన్‌తో కూడిన LCD డిస్‌ప్లే, హర్మాన్ నుంచి డ్యూయల్ స్పీకర్లు, బ్యాక్‌లిట్ కీబోర్డ్, 256GB SSD స్టోరేజీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. (Flipkart)లో దీని ధర, రూ. 46,990 ఉండగా.. ప్రస్తుతం రూ. 35,990కి తగ్గింది.

హెచ్‌పీ 14s (HP 14s) :
కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 40వేల లోపు ఉన్న HP ల్యాప్‌టాప్‌లు స్టాక్‌లో లేవు. అయితే, HP 14s ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో బెస్ట్ సెల్లర్ కూడా ఇదే అని చెప్పవచ్చు. 14-అంగుళాల డిస్‌ప్లే, 11వ-జనరేషన్ కోర్ i3 CPU, 8GB RAM, 256GB స్టోరేజీతో అత్యంత పోర్టబుల్ ల్యాప్‌టాప్.

Best Laptops in India _ April 2023 edition of Best Laptops under Rs 40K in India

Best Laptops in India Photo : (Google)

అదనంగా, SD కార్డ్ కూడా ఉంది. ఇది చాలా మంది రాబోయే క్రియేటర్లకు బెస్ట్ అని చెప్పవచ్చు. అదనంగా, హ్యాండ్స్-ఫ్రీ యాక్షన్లను ప్రారంభించడానికి అమెజాన్ (Amazon) అలెక్సా వాయిస్ (Alexa Voice) అసిస్టెంట్ సపోర్టుతో వస్తుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో చూస్తుంటే.. విలువైన డివైజ్ పరికరం కావాలనుకుంటే.. ఇది బెస్ట్ ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 37,490గా ఉంది.

Lenovo IdeaPad Slim 3i :
HP ల్యాప్‌టాప్ మాదిరిగానే.. ట్రెడేషనల్ బ్రాండ్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లను ఇష్టపడితే.. (Lenovo IdeaPad Slim 3i) బెస్ట్ ఆప్షన్. సాంప్రదాయ బ్రాండ్‌లకు వెళ్లడం వల్ల కలిగే బెనిఫిట్స్ సేల్స్ తర్వాతసర్వీసులను కూడా పొందవచ్చు. IdeaPad Slim 3iలో 11వ-జనరేషన్ కోర్ i3 CPU, 15.6-అంగుళాల డిస్‌ప్లే, 8GB DDR4 RAM, 256 GB SSD M.2 2242 PCIe స్టోరేజీ, డాల్బీ ఆడియోతో కూడిన స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. Lenovo ఇండియా వెబ్‌సైట్‌లో ధర రూ. 38,990గా ఉంది.

Best Laptops in India _ April 2023 edition of Best Laptops under Rs 40K in India

Best Laptops in India Photo : (Google)

Read Also : iPhone 13 Price Offer : ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!