Amara Raja Group: నాయకత్వంలో మార్పులు.. అమరరాజా బాటరీస్ ఛైర్మన్‌గా గల్లా జయదేవ్
దేశంలోనే గొప్ప పేరున్న అమరరాజా లిమిటెడ్ సంస్థలో నాయకత్వ, సంస్థాగత మార్పులు చేసేందుకు సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్‌గా గల్లా జయదేవ్‌ను నియమించారు. ప్రస్తుతం గల్లా జయదేవ్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.

Board Of Amara Raja Batteries Approves Change In Company
Amara Raja Group: దేశంలోనే గొప్ప పేరున్న అమరరాజా లిమిటెడ్ సంస్థలో నాయకత్వ, సంస్థాగత మార్పులు చేసేందుకు సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్‌గా గల్లా జయదేవ్‌ను నియమించారు. ప్రస్తుతం గల్లా జయదేవ్ కంపెనీ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
లేటెస్ట్‌గా కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర కంపెనీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగారు. కొత్త ఛైర్మన్‌గా వచ్చే ఆగస్ట్ నెలలో జయదేశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఏజీఎం వరకు ఆయన డైరెక్టర్, ఛైర్మన్‌గా కొనసాగుతారు.
ఎస్ విజయానంద్‌ను ప్రెసిడెంట్ (న్యూ ఎనర్జీస్)గా నియమించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా హర్షవర్ధన గౌరినేని (హర్ష), విక్రమాదిత్య గౌరినేని (విక్రమ్)ని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న రమాదేవి గౌరినేని బోర్డుకు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బోర్డు ఆమోదించింది.
అనుష్ రామస్వామిని కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించారు. తిరుపతిలోని సంస్థ కేంద్ర కార్యాలయంలో వర్చువల్‌గా జరిగిన బోర్డు సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది కంపెనీ.