గుడ్ న్యూస్ : తక్కువ ధరకే కార్లు, బైకులు!
ఇండియన్ ఆటో రంగానికి గుడ్ న్యూస్. దేశంలో పడిపోతున్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇండియన్ ఆటో రంగానికి గుడ్ న్యూస్. దేశంలో పడిపోతున్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇండియన్ ఆటో రంగానికి గుడ్ న్యూస్. దేశంలో పడిపోతున్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. పన్ను తగ్గింపు నిర్ణయంతో ఆటో రంగానికి పెద్ద ఊరట లభించింది. త్వరలో కొత్త కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో అతి తక్కువ ధరకే నచ్చిన బైకు, కారు కొనేసుకోవచ్చు.
స్థానిక తయారీదారు సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడంతో దసరా, దీపావళి పండుగల సందర్భంగా బైక్, కార్లను తక్కువ ధరకే విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఫెస్టివల్ సీజన్ సమయంలో ఆటో కంపెనీలు పోటీలు పడి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వాహనాల ధరలను తగ్గిస్తుంటాయి.
పితృ పక్షం ముగిసే సమయంలోగా ఆటో సేల్స్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పితృ అమావాస్య నుంచి పండగులు మొదలవుతాయి. వరుసగా దసరా, దీపావళి పండగులు వస్తాయి. ఈ సందర్భంగా చాలామంది వాహనదారులు కొంత వాహనాలను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయాన్ని ఆటో కంపెనీలు కూడా క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. పోటీపడి తక్కువ ధరకే కార్లు, బైకులను ఆఫర్ చేసేందుకు ముందుకు వస్తుంటాయి.
సో… ఈ ఫెస్టివల్ సీజన్ లో కారు, బైక్ కొనేందుకు మీరు ప్లాన్ చేస్తున్నారా? ధరలు తక్కువగా ఉన్నప్పుడే త్వరపడండి. మీకు నచ్చిన బైక్ లేదా కారు వెంటనే సొంతం చేసుకోండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం (సెప్టెంబర్ 20, 2019) కార్పొరేట్ ట్యాక్స్ ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు ద్వారా ఆటో కంపెనీలు తమ తయారీ ఉత్పత్తులపై చెల్లించే పన్ను 25.17 శాతానికి తగ్గింది.
ఇండియాలో దశాబ్ద కాలంలో ఆటో రంగంలోని బైక్, కార్ల కంపెనీల్లో సేల్స్, ప్రొడక్షన్ సప్లయ్ చైన్ భారీగా పడిపోవడంతో తీవ్ర సంక్షోభం ఎదురైంది. దీంతో తమ ప్రొడక్షన్ కూడా నిలిపివేయాలని ఆటో కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుపై నిర్ణయాన్ని ప్రకటించడంతో ఆటో రంగంలో ఆశలు చిగురించాయి. కేంద్రం నిర్ణయాన్ని సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానిఫాక్చరర్స్ (SIAM) స్వాగతించింది.
ఆటో రంగంలో స్థానిక తయారీదారులను మరింత ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. పన్ను తగ్గింపు ప్రకటనతో స్టాక్ మార్కెట్ ఆటో రంగం నుంచి టాప్ గేయినర్స్ లో ఎచెర్ మోటార్స్ లిమిటెడ్ (13.38%), హీరో మోటోకార్పొరేషన్ లిమిటెడ్ (12.34%), మారుతి సుజూకీ ఇండియా లిమిటెడ్ (10.85%) ఆకాశానికి ఎగిశాయి.