Silver Hallmarking : వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..
Silver Hallmarking : బంగారం మాదిరిగా ప్రస్తుతం వెండికి హోల్ మార్కింగ్ తప్పనిసరి కాదు. ప్రస్తుతం భారీగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో వెండికి కూడా హోల్ మార్కింగ్ తప్పని సరి చేయాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.
Silver Hallmarking
Silver Hallmarking : బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. తద్వారా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధరలను మించి వెండి రేటు దూసుకుపోతుంది. గతంలో ఎప్పుడూలేని స్థాయికి వెండి ధర చేరింది. భారత దేశంలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.70లక్షలు దాటేసింది.. రూ. 3లక్షల మార్క్ వైపునకు దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు మోసాల బారిన పడకుండా కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
బంగారం మాదిరిగా ప్రస్తుతం వెండికి హోల్ మార్కింగ్ తప్పనిసరి కాదు. ప్రస్తుతం భారీగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో వెండికి కూడా హోల్ మార్కింగ్ తప్పని సరి చేయాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. వినియోగదారులు మోసాల బారినపడకుండా వెండికి కూడా హోల్ మార్కింగ్ తప్పని చేయాలని భావిస్తోంది. ఈ మేరకు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ వెల్లడించారు.

ప్రస్తుతం స్వచ్ఛందంగా జరుగుతోన్న హోల్ మార్కింగ్ వ్యవస్థలో భాగంగా వెండి వస్తువులపై హోల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కనిపిస్తోంది. దాని ద్వారా వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు, వస్తువుల్లో ఉందా అనేది నిర్ధరించుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే, చిన్న వర్తకులు వెండిని కరిగించి ఆభరణాలు తయారు చేస్తుంటారు. వారిని తప్పనిసరి హోల్ మార్కింగ్ సర్టిఫికేషన్ కిందకు తీసుకురావడం సవాలుతో కూడుకున్నపనేనన్న వాదన ఉంది.
2024లో భారతదేశం 6.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.57,600 కోట్ల) విలువైన శుద్ధి చేసిన వెండిని దిగుమతి చేసుకుంది. ప్రపంచ వెండి వాణిజ్యంలో ఇది 21.4 శాతానికి సమానం. దీంతో ప్రపంచంలోనే శుద్ధి చేసిన వెండిని అత్యధికంగా దిగుమతి చేసుకున్నదిగా మన దేశం నిలిచింది.
హాల్ మార్కింగ్ అంటే ఏమిటి..?
బంగారం, వెండి వంటి విలువైన లోహాల స్వచ్ఛతకు ఇచ్చే ధ్రువీకరణను హాల్ మార్కింగ్ గా పిలుస్తారు. లోహం స్వచ్ఛత, బీఐఎస్ లోగో, ఆభరణాల విక్రేత గుర్తు, ప్రతి ఆభరణానికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (హెచ్‌యూఐడీ) వంటివి బీఐఎస్ గుర్తింపు పొందిన కేంద్రాల్లో ఆభరణాలపై ముద్రిస్తారు. కొనుగోలుదారులు చెల్లింపులకు అనుగుణంగా, ఆభరణాల్లో లోహం స్వచ్ఛత ఉందనేందుకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణగా నిలుస్తుంది. తక్కువ నాణ్యత ఉత్పత్తులను, మోసాలను అరికట్టేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
