తగ్గిన వంట గ్యాస్ ధర: నూతన సంవత్సర కానుక

  • Published By: chvmurthy ,Published On : December 31, 2018 / 02:08 PM IST
తగ్గిన వంట గ్యాస్ ధర: నూతన సంవత్సర కానుక

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు నూతన సంవత్సర కానుక అందచేసింది. వంటగ్యాస్ ధరలను తగ్గిస్తు నిర్ణయం తీసుకుంది. రాయితీ లేని సిలిండర్ పై రూ.120-50 పైసలు తగ్గించింది. రాయితీగల సిలిండర్ పై రూ.5.91 పైసలు తగ్గించింది. తగ్గించిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.ప్రస్తుతం ఢిల్లీలో  14.2 కేజీలు ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ.500.90 పైసలుగా ఉంది. ధర తగ్గి ఇప్పుడు రూ.494.99 పైసలుకు వినియోగదారులకు అందనుంది. వినియోగదారుడుకి ప్రభుత్వం సంవత్సరానికి 12 సబ్సిడీ సిలిండర్లను అందచేస్తోంది. రాయితీ లేని సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీ లో రూ.809-50 పైసలు కాగా రేపటినుంచి  దాని ధర రూ.689.50 పైసలు కానుంది.