December 2024 Bank Holidays : డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు : ఏ రోజు సెలవు ఉంటుందో తెలుసా?

December 2024 Bank Holidays : బ్యాంకు అకౌంట్‌దారులు సెలవుల్లో డిజిటల్ ప్లాట్‌ఫాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఏటీఎం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు.

December 2024 Bank Holidays : డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు : ఏ రోజు సెలవు ఉంటుందో తెలుసా?

December 2024 Bank Holidays

Updated On : November 30, 2024 / 7:16 PM IST

December 2024 Bank Holidays : 2024 చివరి నెల డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఆదివారం, రెండవ, నాల్గవ శనివారాలు, వివిధ పండుగల సెలవు దినాలలో బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసివేయనుందో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం.

17 రోజుల బ్యాంక్ సెలవుల జాబితా :

  • డిసెంబర్ 1 – ఆదివారం (దేశమంతా)
  • డిసెంబర్ 3 – శుక్రవారం (గోవా)
  • డిసెంబర్ 8 – ఆదివారం (దేశమంతా )
  • డిసెంబర్ 12 – మంగళవారం (మేఘాలయ)
  • డిసెంబర్ 14 – రెండవ శనివారం (దేశమంతా)
  • డిసెంబర్ 15 – ఆదివారం (దేశం అంతటా )
  • డిసెంబర్ 18 – బుధవారం (మేఘాలయ)
  • డిసెంబర్ 19 – గురువారం గోవా విమోచన దినం (గోవా)
  • డిసెంబర్ 22 – ఆదివారం (దేశమంతటా)
  • డిసెంబర్ 24 – మంగళవారం (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ) క్రిస్మస్ ఈవ్ హాలిడే
  • డిసెంబర్ 25 – బుధవారం (దేశమంతటా) క్రిస్మస్
  • డిసెంబర్ 26 – గురువారం (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ) క్రిస్మస్ సెలవు
  • డిసెంబర్ 27 – శుక్రవారం (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ) సెలవు క్రిస్మస్
  • డిసెంబర్ 28 – ఆదివారం (దేశమంతటా)
  • డిసెంబర్ 30 – సోమవారం (మేఘాలయ)
  • డిసెంబర్ 31 – మంగళవారం (మిజోరం, సిక్కిం)

బ్యాంకు అకౌంట్‌దారులు సెలవుల్లో డిజిటల్ ప్లాట్‌ఫాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఏటీఎం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే, బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందే తెలుసుకోవడం ద్వారా కస్టమర్లు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడబోతున్నాయో కస్టమర్లు గమనించాలి. వివిధ సెలవుల కారణంగా బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ, వినియోగదారులు ఆన్‌లైన్ సర్వీసులను ఉపయోగించి తమ ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.

అత్యవసరంగా నగదు అవసరమైతే.. మీరు ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఏటీఎం విత్‌డ్రా ఆప్షన్ కూడా బ్యాంకు అకౌంటుదారులకు బ్యాంకు సెలవుల్లో అందుబాటులో ఉంది. ఇది కాకుండా, కస్టమర్లు వివిధ మొబైల్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు.

చిన్న మొత్తాల కోసం బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గింది. చాలా మంది వినియోగదారులు గూగుల్ ప్లే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది బ్యాంకులకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. దానికి అనుగుణంగా బ్యాంకులు సెలవులు తీసుకుంటాయి. ఇది కాకుండా, స్థానిక, జాతీయ పండుగలు లేదా మతపరమైన పండుగల సందర్భంగా కూడా సెలవులు ప్రకటిస్తారు.

Read Also : SSC MTS Answer Key 2024 : ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ ఆన్సర్ కీ విడుదల.. ఈ లింక్ ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?