ధీరూభాయ్ అంబానీ వర్ధంతి.. జియో ఉద్యోగుల రక్తదానం
జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత ధీరూభాయ్ అంబానీ 22వ వర్ధంతి వేళ డెక్కన్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ జియో తెలంగాణ హెడ్ క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు ఉద్యోగులు రక్తదానం చేశారు. ధీరూభాయ్ అంబానీ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. గ్యాస్ స్టేషన్ అటెండెంట్ నుంచి ధీరూభాయ్ అంబానీ చేసిన ప్రయాణం తరతరాలకు స్పూర్తినిస్తోందని అన్నారు. 1932లో గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జన్మించిన అంబానీ తన సోదరుడితో కలిసి బెస్సే అండ్ కోలో పని చేసేందుకు యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు బయలుదేరారు.
ఏడెన్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా ఆయన కుటుంబం ముంబైకి మకాం మార్చారు. అక్కడ తన బంధువు చంపక్లాల్ దమానీతో భాగస్వామ్యంతో “మాజిన్” ప్రారంభించారు. కంపెనీ యెమెన్‌కు పాలిస్టర్ నూలు, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేది. 1966లో ధీరూభాయ్ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. అదే 1973 మే 8న రిలయన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది.
Also Read: కొత్త కారు కోసం చూస్తున్నారా? భారత్‌కు వోల్వో నుంచి 2 సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు..!