Twitter CEO : నేను దిగిపోతున్నా.. ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరంటే..? మరో 6 వారాల్లో మీరే చూస్తారు.. ఎలన్ మస్క్!
Twitter CEO Elon Musk : గత ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్ కొనుగోలు చేశాడు ఎలన్ మస్క్.. తాత్కాలిక సీఈఓగా మాత్రమే కొనసాగతానన్నాడు. అన్నట్టే తాను సీఈఓగా వైదొలగనున్నాడు. ఇప్పుడు కొత్త సీఈఓను నియమించుకున్నాడట.. ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అవుతానని చెప్పాడు.

Elon Musk to step down as Twitter head, says new CEO will start in 6 weeks
Twitter CEO Elon Musk : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈఓగా ఎలన్ మస్క్ (Elon Musk) ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ట్విట్టర్ టేకోవర్ చేశాడు. అన్నట్టుగానే సీఈఓ హోదాలో కొనసాగాడు. ఇక తాను సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే సమయం ఆసన్నమైందని అంటున్నాడు. తన స్థానంలో ట్విట్టర్ కొత్త సీఈఓ (New Twitter CEO) ని వెతికే పనిలో పడ్డాడు. ఎట్టకేలకు ట్విట్టర్ కొత్త సీఈఓను పట్టేశాడు.
వచ్చే ఆరు వారాల్లో ట్విట్టర్ పగ్గాలను కొత్త సీఈఓ చేతుల్లో పెట్టనున్నాడు మస్క్. ట్విట్టర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన మస్క్.. కొత్త సీఈఓ ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు. ఆ వ్యక్తి పేరు చెప్పకుండానే ట్విట్టర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరో 6 వారాల్లో వస్తున్నారంటూ హింట్ ఇచ్చాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా మారతానని మస్క్ ట్వీట్ చేశాడు.
ఇకపై తాను ట్విట్టర్ సీఈఓ కాదని, కేవలం తన రోల్ ఎగ్జిక్యూటివ్ చైర్ & CTOగా మారుతుందన్నాడు. ప్రొడక్టు సాఫ్ట్‌వేర్ & సిసోప్‌లను పర్యవేక్షించడమే తన పనిగా మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇంతకుముందు ట్విట్టర్ కాబోయే అభ్యర్థులను మస్క్ రివీల్ చేయలేదు. తన వారసుడిగా ఎవరిని సీఈఓగా ఎన్నుకున్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. దాంతో అందరిలో ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. రాబోయే కొత్త సీఈఓ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also : Twitter: ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేయనున్న మస్క్.. ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించేందుకు సిద్ధం
ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యక్కరినో.. :
కామ్‌కాస్ట్ (Comcast) NBC యూనివర్శ్లల్ (NBCUniversal)లో టాప్ అడ్వర్టైజింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన లిండా యక్కరినో (Linda Yaccarino) ట్విట్టర్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే మస్క్ ఎంపిక కావొచ్చునని సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్, మాజీ హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. గత నెలలో మియామీలో జరిగిన ఒక అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లో యాడ్ ఇండస్ట్రీ లీడర్ లిండా యక్కరినో (Linda Yaccarino) మస్క్‌ని ఇంటర్వ్యూ చేశారు. యాహూ మాజీ సీఈఓ మారిస్సా మేయర్‌ను గురువారం ట్విటర్ ఉద్యోగుల మధ్య సంభాషణలో సూచించినట్లు ఒక సిబ్బంది తెలిపారు.

Twitter CEO Elon Musk to step down as Twitter head, says new CEO will start in 6 weeks
మాజీ యూట్యూబ్ సీఈఓ సుసాన్ వోజ్‌కికీ, మస్క్ బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్, షివోన్ జిలిస్ కూడా బ్లైండ్‌పై ట్విట్టర్ ఉద్యోగులు చర్చించే పేర్లలో ఉన్నారని మాజీ ఉద్యోగి తెలిపారు. సీఐ రూజ్‌వెల్ట్‌లోని సీనియర్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ జాసన్ బెనోవిట్జ్ ప్రకారం.. మస్క్ ఇతర కంపెనీలకు చెందిన టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్‌లు, స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్, టెస్లా ఇంక్ చైర్ రాబిన్ డెన్‌హోమ్ పేర్లు కూడా ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ఇటీవలే టెస్లా షేర్లు 2.1శాతం అధికంగా ముగిశాయి. అక్టోబర్‌లో మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత ఎలక్ట్రిక్-వాహన తయారీదారు షేర్లు భారీగా దెబ్బతిన్నాయి.
మస్క్ ట్విట్టర్ కొత్త అధినేత కోసం చాలాకాలంగా వెతుకుతున్నాడు. డిసెంబర్‌లో మస్క్ ట్విట్టర్ పోల్ నిర్వహించగా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ CEO పదవి నుంచి తాను వైదొలగాలని 57.5శాతం వినియోగదారులు ఓటు వేశారు. సీఈఓ బాధ్యతలు ఎవరో తేలితే.. మరుక్షణమే తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తానని మస్క్ స్పష్టం చేశాడు. గత అక్టోబర్‌లో కొత్త ట్విట్టర్ అధినేతగా మొదటి రెండు వారాల్లోనే అనేక మార్పులు తీసుకొచ్చాడు మస్క్. ట్విట్టర్ మునుపటి CEO పరాగ్ అగర్వాల్. ఇతర సీనియర్ ఎగ్జిక్యూటీవలను తొలగించాడు. ఆ తర్వాత నవంబర్‌లో సగం మంది ట్విట్టర్ సిబ్బందిని తొలగించాడు.