తగ్గనున్న EMIలు…లోన్స్ పై మారటోరియం మరో 3నెలలు పొడిగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : May 22, 2020 / 05:46 AM IST
తగ్గనున్న EMIలు…లోన్స్ పై మారటోరియం మరో 3నెలలు పొడిగింపు

Updated On : May 22, 2020 / 5:46 AM IST

వడ్డీరేట్లపై ఆర్బీఐ మరోసారి కీలక ప్రకటన చేసింది. లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన 20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ తర్వాత ఇవాళ(మే-22,2020)ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రెపో రేటు 40బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్వహించి…ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుందన్నారు. 

రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు తెలిపిన శక్తికాంత్ దాస్.. రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయని, మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు. రుణాలపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు SIDBIకి మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. టర్మ్‌ లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుందని శక్తికాంత్ దాస్ అన్నారు. 2021లోనూ జీడీపీ తిరోగమనంలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.

తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గడంతో సామాన్యుడికి ఊరట లభిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందైని, పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తామన్నారు. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గిందదన్నారు. 4 కేటగిరిలుగా ఎగుమతులు, దిగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ కు ఇది 3వ మీడియా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్‌ 17న రెండోసారి కోవిడ్‌ -19 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిడ్‌-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా రెపో రేటు 75బేసిస్‌ పాయింట్ల తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత విదేశీ మారక నిల్వలు… 487 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నట్లు ఇవాళ శక్తికాంత్ దాస్ తెలిసారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందన్నారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ముడి పదార్థాల ఇన్‌పుట్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
 

శక్తికాంత్ దాస్ ప్రసంగంలోని ముఖ్యమైన 5 విషయాలు
-రెపో రేటుని 4.40 నుంచి 4 శాతానికి తగ్గించారు
-రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు.
-మూడు నెలల మారటోరియం జూన్-1నుంచి ఆగస్టు31వరకు పొడిగింపు
-90రోజుల టర్మ్ లోన్ సౌకర్యం కోసం SIDBIకి మరో 90రోజుల పొడిగింపు
-యూఎస్ డాలర్ స్వాప్ సదుపాయాన్ని పొందడానికి ఎక్సిమ్ బ్యాంకులకు రూ .15 వేల కోట్లు కేటాయించిన ఆర్బీఐ. దీనికి ఏడాది వరకు రోల్‌ఓవర్ సౌకర్యం ఉంటుంది

Read: బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి సమయమిదేనా..