EPFO News : EPFO మెగా ప్లాన్.. వేతన పరిమితి రూ. 25వేలకు పెంపు? కోటి మందికిపైగా బిగ్ బెనిఫిట్స్.. పెన్షనర్లకు పండగే..!
EPFO News : ఈపీఎఫ్ఓ రాబోయే నెలల్లో ఈపీఎఫ్, ఈపీఎస్‌లో ఉద్యోగులను చేర్చేందుకు నెలకు రూ. 25వేల వేతన పరిమితిని పెంచే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
EPFO News
EPFO News : ఈపీఎఫ్, ఈపీఎస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వేతనపరుల జీతం పరిమితిని పెంచేందుకు ఈపీఎఫ్ఓ భారీగా సన్నహాలు చేస్తోంది. ఈ మెగా ప్లాన్ ద్వారా కోటి మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అంటే.. నెలకు రూ. 15వేల నుంచి రూ. 25వేలకు పెంచాలని యోచిస్తోంది. ఈ కీలక నిర్ణయంతో ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) ప్రయోజనాలను పది మిలియన్లకుపైగా విస్తరించనుంది.
కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత (EPFO News) అంచనా ప్రకారం.. రూ. 10వేల పెంపుదల మరింత మందిని ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురానుంది. వచ్చే డిసెంబర్ లేదా జనవరి 2026లో జరిగే సమావేశంలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ప్రతిపాదనను చర్చించనుంది. ఇప్పటికే, కార్మిక సంఘాలు దీర్ఘకాలంగా ఈ పెంపుపై డిమాండ్ చేస్తున్నారు. అనేక మెట్రో నగరాల్లో తక్కువ, మధ్యస్థ నైపుణ్యం కలిగిన వేతనపరుల నెలవారీ జీతం రూ. 15వేలు దాటింది.
ప్రస్తుతం, నెలకు రూ. 15వేలకు కనీస వేతనం అందుకునే ఉద్యోగులు ఈపీఎఫ్, ఈపీఎస్ పథకాల నుంచి వైదొలగవచ్చు. కంపెనీలు చట్టబద్ధంగా ఇలాంటి ఉద్యోగులను ఈ పథకాలలో చేర్చుకోవలసిన అవసరం లేదు. ఈ కొత్త పరిమితి అమలుతో ముఖ్యమైన సామాజిక భద్రతా పథకాలలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు చేరేందుకు వీలుంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా ఈపీఎఫ్ఓ మొత్తం ఫండ్ భారీగా పెరుగుతుంది.
భారీగా పెరగనున్న పెన్షనర్ల వేతనాలు :
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఎంప్లాయిర్, ఉద్యోగి ఇద్దరూ ప్రతి నెలా ఉద్యోగి జీతంలో 12శాతం వాటా ఇవ్వాలి. అయితే, ఉద్యోగి మొత్తం 12శాతం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. అయితే, ఎంప్లాయిర్ 12శాతం ఈపీఎఫ్ (3.67శాతం), ఈపీఎస్ (8.33శాతం) మధ్య విభజించారు.
Read Also : Elon Musk : జీతం పెంచకపోతే మానేస్తా.. ధమ్కీ ఇస్తున్న ఎలాన్ మస్క్.. టెస్లా బాస్ అన్నంత పనిచేస్తాడా?
వేతన పరిమితి పెంపు అనేది ఈపీఎఫ్, ఈపీఎస్ ఫండ్స్ గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్లు పొందే పెన్షన్ భారీగా పెరగనుంది. అంతేకాదు.. పెన్షనర్ల డిపాజిట్లపై వచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం, ఈపీఎఫ్ఓ మొత్తం ఫండ్ సుమారు రూ. 26 లక్షల కోట్లు ఉండగా, యాక్టివ్ మెంబర్లు సుమారు 7.6 కోట్ల మంది ఉన్నారు.
జీతం పరిమితి పెంపుతో ప్రయోజనాలేంటి? :
ఈపీఎఫ్ జీతం పరిమితిని నెలకు రూ. 15వేల నుంచి రూ. 25వేలకు పెంచడం సామాజిక భద్రతా కవరేజీని విస్తరించే దిశగా ప్రగతిశీల అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత వేతన స్థాయిలకు అనుగుణంగా ఉండటం అత్యంత అవసరం. ఈ మార్పుతో ఉద్యోగులకు చట్టపరమైన ఖర్చులు, సమ్మతిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. జీతాల పారదర్శకతను కూడా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు, తగ్గింపుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండాలి.
ప్రభుత్వ నిర్ణయం ఏంటి? :
రూ. 15వేల పరిమితి కారణంగా ప్రస్తుతం ఈపీఎఫ్, ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతున్న లక్షలాది మందికి ఈ పెంపు బిగ్ రిలీఫ్ అందిస్తుంది. నగరాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో రూ. 15వేల జీతం ఇకపై కుటుంట జీవనానికి సరిపోదు. వారి భవిష్యత్తు అనిశ్చితంగా మారొచ్చు. అందుకే ఆర్థిక భద్రతను అందించేందుకు ఈపీఎఫ్ఓ అసంఘటిత రంగం నుంచి ఎక్కువ మందిని వ్యవస్థీకృత రంగ పథకాలలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
