రీడిజైన్.. రీబ్రాండింగ్ : Facebook కొత్త లోగో చూశారా?

  • Published By: sreehari ,Published On : November 6, 2019 / 09:14 AM IST
రీడిజైన్.. రీబ్రాండింగ్ : Facebook కొత్త లోగో చూశారా?

Updated On : November 6, 2019 / 9:14 AM IST

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం Facebook లోగో మారింది. కొత్త లోగోను రీడిజైన్ చేసి ఆవిష్కరించింది. ఈ కొత్త లోగోను ఇతర సొంత యాప్స్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లోగోల కంటే విభిన్నంగా మార్చేసింది. 2019 ఏడాదిలో జూన్ లోనే ఫేస్ బుక్ రీబ్రాండింగ్ ప్రాసెస్ ప్రారంభించింది. పేరంట్ కంపెనీగా ప్రత్యేక గుర్తింపు ఉండేలా కార్పొరేట్ కంపెనీ (ఓన్ బ్రాండింగ్) లోగోను రీడిజైన్ చేసినట్టు కంపెనీ సీఎంఓ ఆంటినో లుషియో ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కొత్త బ్రాండింగ్ డిజైన్.. స్పష్టత, అక్షరస్వరూపం, పెద్ద అక్షరాలతో కంపెనీ లోగో రూపొందించింది. యాప్ లకు భేదాన్ని గుర్తించేలా క్రియేట్ చేసినట్టు లుషియో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఫేస్ బుక్ సొంత యాప్ సర్వీసుల్లో ఫేస్ బుక్ యాప్, మెసేంజర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, అక్యులస్, వర్క్ ప్లేస్, పోర్టల్, కాలిబ్రా (డిజిటల్ కరెన్సీ లిబ్రా ప్రాజెక్టు)లను అందిస్తోంది. 

ఈ లోగోలో ఫాంట్ మార్చేసి అన్ని పెద్ద అక్షరాలే ఉంచింది. దీనికి సంబంధించి GIF ఇమేజ్ రూపొందించింది. అందులో నీలం రంగు.. ఫేస్ బుక్, ఆకు పచ్చ వాట్సాప్, ఊదారంగులో (గులాబి)తో కనిపించేలా డిజైన్ చేసింది. ఫేస్ బుక్ తమ సొంత యాప్స్ వాట్సాప్, ఫేస్ బుక్, మెసేంజర్, ఇన్ స్టాగ్రామ్ యాప్స్ కూడా తమదేననే అందరూ గుర్తించేలా సోషల్ దిగ్గజం ఈ కొత్త లోగోను ఆవిష్కరించింది.   

రానున్న వారాల్లో ఫేస్ బుక్ కొత్త బ్రాండ్ ను వినియోగించడం ప్రారంభించనుంది. కొత్త కంపెనీ వెబ్ సైట్ సహా తమ ప్రొడక్టులు, మార్కెటింగ్ మెటేరియల్స్ ను కొత్త బ్రాండ్ ద్వారా ప్రమోట్ చేయనుంది. కస్టమ్ టైపోగ్రఫీతో కొత్త లోగో లో వాడగా, స్పష్టత కోసం డిజైన్ చేశారు. కంపెనీ లోగోకు, యాప్ లోగోలకు కచ్చితమైన తారతమ్యాన్ని గుర్తించేలా రీడిజైన్ చేసింది.

ఫేస్ బుక్ కంపెనీ వెబ్ పేజీ మాత్రమే కొత్త లోగో డిజైన్ ఉంటుందని, ఫేస్ బుక్ యాప్ లోగో లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఫేస్ బుక్ కొత్త లోగోను ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ట్వీట్ చేశారు. ఇందులో ట్విట్టర్ లోగో కూడా అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే ఉన్నాయి. 

ఫేస్ బుక్ కొత్త లోగోను చూసిన కొంతమంది మార్కెటింగ్ నిపుణులు.. రీబ్రాండింగ్ లోగో.. గూగుల్ పేరంట్ కంపెనీ అల్ఫాబెట్ ఇంక్ మాదిరిగానే రీడిజైన్ చేసినట్టు చెబుతున్నారు. కంపెనీ ప్రొడక్టుల ఆఫర్లను మరింత పెంచుకునేందుకు వీలుగా మార్కెట్ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు వీలుగా లోగో రీబ్రాండింగ్ చేసినట్టు తెలిపారు. ఫేస్ బుక్ కంపెనీ కొత్త లోగోలో అన్ని అక్షరాలు క్యాపిటల్స్ ఉన్నాయి. చూడటానికి పెద్దగానూ ఎంతో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇతర సొంత యాప్స్ లతో పోలిస్తే కొత్త లోగోలో చాలా తేడా కనిపిస్తోంది. ఈ కొత్త లోగో డిజైన్ పై ఫేస్ బుక్ యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.