Hyderabad-London : ఎయిరిండియా నాన్ స్టాప్ విమాన సర్వీసులు.. ఫస్ట్ ఫ్లైట్ టేకాఫ్!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లొచ్చు. శుక్రవారమే ఫస్ట్ విమానం టేకాఫ్ అయింది.

First Hyderabad London Air India Flight
First Hyderabad-London Air India flight : ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లొచ్చు. మధ్యలో ఎక్కడా ఆగదు. శుక్రవారమే ఫస్ట్ విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ ఇండియా AI 147 విమానం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. ఈ సందర్భంగా అక్కడి జీఎంఆర్ సిబ్బంది కేక్ కటింగ్ చేశారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమైన ఈ నాన్ స్టాప్ సర్వీసులు ప్రతి సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు నడవనున్నాయి.
Plank Position : 9 గంటల పాటు ప్లాంక్ పొజిషన్.. ఇది ప్రపంచ రికార్డు
AI 147 ఫ్లయిట్ హైదరాబాద్‌లో సోమవారం రాత్రి 1:30 గంటలకు బయల్దేరి లండన్‌కు ఆ రోజు ఉదయం 7:30 గంటలకు చేరనుంది. AI 147 ఫ్లయిట్ శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బయల్దేరింది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు లండన్‌కు చేరుకోనుంది. అక్కడి నుంచి AI 148 ఫ్లయిట్ ప్రతి ఆది, గురువారాల్లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనుంది.
ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, అమృత్‌సర్, గోవా నుంచి నేరుగా లండన్‌కు ఎయిరిండియా విమానాలు నడుస్తున్నాయి. ఇప్పుడా జాబితాలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు కూడా చేరింది. హైదరాబాద్ టు లండన్ నాన్ స్టాప్ విమాన సర్వీసులకు సంబంధించి పూర్తి వివరాలకు www.airindia.in వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. ఎంక్వైరీ కోసం టోల్ ఫ్రీ నంబర్ 1860 233 1407 కాల్ చేయడం ద్వారా వివరాలను పొందవచ్చు.
Amazon : ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ ధర తగ్గింపు