Plank Position : 9 గంటల పాటు ప్లాంక్ పొజిషన్.. ఇది ప్రపంచ రికార్డు

ప్లాంక్ పొజిషన్ లో సరికొత్త రికార్డు క్రేయేట్ చేశాడు ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ స్కాలీ. 9 గంటల 30 నిముషాల 1 సెకను పాటు ప్లాంక్ పొజిషన్ లో ఉంది గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు.

Plank Position : 9 గంటల పాటు ప్లాంక్ పొజిషన్.. ఇది ప్రపంచ రికార్డు

Plank Position

Updated On : September 10, 2021 / 2:24 PM IST

Plank Position : ప్రపంచ రికార్డుల కోసం కొందరు చేసే పనులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఎవరు నెలకొల్పని రికార్డుల కోసం ఎంతగానో శ్రమిస్తారు కొందరు. ఆలా నిరంతర శ్రమ పట్టుదలతో సాధన చేసి గిన్నిస్ బుక్ రికార్డులలో పేరు నమోదు చేసుకుంటుంటారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఇదేతరహాలో శ్రమించి ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు. ప్లాంక్ పొజిషన్ లో 9 గంటలకు పైగా ఉండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.

ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ స్కాలీ.. ప్లాంక్ పొజిషన్ లో 9 గంటల 30 నిమిషాల ఒక సెకను పాటు ఉండి ప్రపంచ రికార్డు క్రేయేట్ చేశారు. గతంలో 8 గంటల 15 నిముషాల 15 సెకన్లపాటు నమోదైన రికార్డును తాజాగా స్కాలీ క్రాక్‌ చేసినట్టు గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేసిన వీడియో ద్వారా వెల్లడించింది.

ఆగస్టు 6, 2021న ఈ రికార్డు నమోదైనట్టు తెల్పింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Guinness World Records (@guinnessworldrecords)