Bajaj – Triumph new Bike: బజాజ్, ట్రయంఫ్ కలయికలో మొదటి బైక్ రెడీ, ఇక ప్రత్యర్థులతో యుద్ధమే

రెట్రో సెగ్మెంట్ లో తమ వాటా కోసం ప్రయత్నిస్తున్న బజాజ్, ఇండియాలో మరింత విస్తరణ దిశగా ప్రయత్నిస్తున్న ట్రయంఫ్..కలిసి వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ బైక్ ఎంతో ఆకట్టుకుంటుంది.

Bajaj – Triumph new Bike: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ మోటార్ సైకిల్స్.. యూకేకి చెందిన ప్రీమియం మోటార్ సైకిల్ కంపెనీ “ట్రయంఫ్”తో జతకట్టిన సంగతి తెలిసిందే. 2020 జనవరిలో ఈ రెండు సంస్థలు జాయింట్ వెంచర్ ను ప్రారంభిస్తూ.. ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం కుదిరిన సరిగా రెండేళ్ల అనంతరం.. బజాజ్-ట్రయంఫ్ ఉమ్మడిగా తయారు చేసిన సరికొత్త మోడల్ సిద్ధమైంది. ఇంకా పేరు ఖరారుకాని ఈ బైక్ కు సంబందించిన ఫోటోలు, స్పై షాట్స్ ఇటీవల రివ్యూ సంస్థ MCN కంటపడ్డాయి.

Also Read: Village Volunteer: వాలంటీర్ వక్ర బుద్ధి: వృద్దురాలి పెన్షన్ కాజేసిన వైనం

రెట్రో సెగ్మెంట్ లో తమ వాటా కోసం ప్రయత్నిస్తున్న బజాజ్, ఇండియాలో మరింత విస్తరణ దిశగా ప్రయత్నిస్తున్న ట్రయంఫ్..కలిసి వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ బైక్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే KTM, Kawasaki, Husqvarna వంటి విదేశీ మోడల్స్ ను భారత్ కు తీసుకువచ్చిన బజాజ్ సంస్థ..ప్రీమియం స్పోర్ట్స్ బైక్స్ కేటగిరీలో 50 శాతంకు పైగా వాటా కలిగి ఉంది. అదే సమయంలో రెట్రో, క్లాసిక్ సెగ్మెంట్ లో బజాజ్ నుంచి ఒక్క బైక్ కూడా లేదు. ఇప్పటివరకు రెట్రో క్లాసిక్ సెగ్మెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే ఇండియాలో రారాజుగా కొనసాగుతుంది.

Also read: Mamata Banerjee: విచారణకు రావాలంటూ మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు

ఈక్రమంలో ట్రయంఫ్ తో జతకట్టిన బజాజ్.. ఇంతకుముందే తమ ఇతర మోడల్స్ లో ఉన్న ఇంజిన్లను కాదని.. ఓ సరికొత్త ఇంజిన్ ను అభివృద్ధి చేసింది. బైక్ రివ్యూ సంస్థ MCN సేకరించిన వివరాలు మేరకు.. 350-500సీసీ సామర్ధ్యంతో ఈ ఇంజిన్ ను తయారు చేశారు. సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ లో USD ఫోర్క్స్, LED లైట్లు, TFT డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఇంజిన్ ప్లాట్ ఫార్మ్ పైనే రెండు మోడల్స్ ను తీసుకొచ్చే. ముందు వెనుక 17 అంగుళాల టైర్ తో ఒక క్లాసిక్ మోడల్, ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల టైర్ తో స్క్రామ్బులార్ మోడల్ ను తీసుకురానున్నారు. అన్ని కుదిరితే ఈఏడాదిలోనే ఈ రెండు బైక్ లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందంటూ బైక్ నిపుణులు చెబుతున్నారు.

Also read: Viral Video: వంకర టింకరగా ల్యాండ్ అవబోయిన విమానం, తృటిలో తప్పిన పెనుప్రమాదం

ట్రెండింగ్ వార్తలు