వారానికి ఐదు రోజులే బ్యాంకులు.. మళ్లీ ఊపందుకున్న ప్రచారం

2015 నుంచి బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో ప్రభుత్వ సెలవు దినాలుగా పాటిస్తున్నాయి. మిగతా శనివారాల్లో కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్నారు.

వారానికి ఐదు రోజులే బ్యాంకులు.. మళ్లీ ఊపందుకున్న ప్రచారం

five days banking trending in social media and what government said in parliament

Updated On : December 30, 2023 / 7:58 PM IST

5 days banking: ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ప్రచారం మరోసారి ఊపందుకుంది. బ్యాంకులు వారానికి ఐదు రోజులే పనిచేసేలా చూడాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 5 రోజులే పని దినాలు ఉండాలని బ్యాంకు ఎంపాయిస్.. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు కోరుతున్నారు. అన్ని శనివారాలను అధికారిక సెలవులుగా ప్రకటించాలని బ్యాంకింగ్ రంగం కోరుకోంటోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మూడు వారాల క్రితం పార్లమెంట్‌లో ప్రకటించింది. ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కోరిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ వెల్లడించారు.

అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలి
2015 నుంచి దేశంలోని బ్యాంకులు ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాల్లో ప్రభుత్వ సెలవు దినాలుగా పాటిస్తున్నాయి. మిగతా శనివారాల్లో కూడా సెలవు ప్రకటించాలని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్నారు. తమపై పనిభారం బాగా పెరిగిందని, అధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నామని బ్యాంక్ ఎంప్లాయిస్ అంటున్నారు. పనికి తగ్గట్టుగా కొత్త నియామకాలు లేకపోవడం కూడా తమకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. పని గంటలు ముగిసిన తర్వాత కూడా గంటల తరబడి పనిచేయాల్సి వస్తోందని, ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

Also Read: రెసిడెన్షియల్‌, కమర్షియల్ నిర్మాణాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు.. రియల్టీలో నయా ట్రెండ్

ఫైవ్ డేస్ బ్యాంకింగ్ తాజాగా ఎక్స్ (ట్విటర్)లో ట్రెండింగ్ లోకి వచ్చింది. #5DaysBanking హాష్ ట్యాగ్ తో మీమ్స్ తో పాటు తమ బాధలు పంచుకుంటున్నారు. 2023లో ఈరోజు చివరి శనివారం కావడంతో తమకు ఇదే లాస్ట్ వర్కింగ్ సాటర్డే కావాలని కోరుకుంటున్నారు. బ్యాంకు జాబ్ చాలా ఒత్తిడితో కూడుకున్న పని కావడంతో చాలా కాపురాలు కూలిపోతున్నాయని, ఆత్మహత్యల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని నెటిజన్ ఒకరు కమెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కనికరించి తమ డిమాండ్ పరిష్కరించాలని చాలా మంది బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు.

Also Read: హైదరాబాద్‌లో మరో గోల్డ్ ఏటీఎం.. బంగారం ఎలా తీసుకోవాలి..?

అయితే ఫైవ్ డేస్ బ్యాంకింగ్‌పై ఖాతాదారులు మాత్రం వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులకు పెద్దగా పనేమి ఉండదని, ఖాతాదారులను కాల్చుకుతినడమే వారి పని అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఐదు రోజులు ఎందుకు ఒకట్రెండు రోజులు సరిపోతాయో అంటూ మరొకరు కమెంట్ పెట్టారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు 6 రోజులు పని చేస్తున్నారని, బ్యాంకు ఎంప్లాయిస్‌కు మాత్రం 5 రోజులే ఎందుకని మరొకరు ప్రశ్నించారు.