Samsung Galaxy A35 : ఇది కదా ఆఫర్ అంటే.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Samsung Galaxy A35 : ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A35 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A35
Samsung Galaxy A35 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో ఎప్పటిలాగే స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, సేల్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే కొన్ని ఎర్లీ బర్డ్ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A35 ఫోన్ ధర రూ. 32,999కు పొందవచ్చు. కానీ, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ (Samsung Galaxy A35) ద్వారా మిడ్-రేంజ్ ఇప్పుడు రూ. 20వేల ధరకు లభ్యం కానుంది. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 ప్రారంభ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్ ప్రారంభ ప్రమోషన్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ A35 మోడల్ రూ. 23,999కు లిస్ట్ అయింది. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 9వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్‌లు ఈఎంఐ లావాదేవీలపై రూ. 4వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
మొత్తంగా సేవింగ్ రూ. 13వేల వరకు చేయొచ్చు. లేదంటే.. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 12,250 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A35 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. హుడ్ కింద, ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. అడ్రినో 710 జీపీయూ, 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో బాక్స్ వెలుపల వస్తుంది. 6 జనరేషన్ OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందుకుంటుంది.
కెమెరాల విషయానికొస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, బ్యాక్ సైడ్ 5MP మాక్రో ఫీచర్లను కలిగి ఉంది. అయితే, 12MP సెల్ఫీ షూటర్ ఫ్రంట్ సైడ్ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది.