తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు : Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్
ఫెస్టివల్ సీజన్ మొదలైంది. మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్ సైట్లు వరుసగా పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లపై తక్కువ ధరకే డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.

ఫెస్టివల్ సీజన్ మొదలైంది. మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్ సైట్లు వరుసగా పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లపై తక్కువ ధరకే డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.
ఫెస్టివల్ సీజన్ మొదలైంది. మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్ సైట్లు వరుసగా పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్త స్మార్ట్ ఫోన్లపై తక్కువ ధరకే డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ సేల్ కొనసాగుతుంది.
సెప్టెంబర్ 30 నుంచి స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. యాక్సస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐసిఐసీఐ కార్డుల ద్వారా మొబైల్స్ కొనుగోలు చేసినవారికి 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ అందించే మొబైల్స్ డీల్స్ లో శాంసంగ్ గెలాక్సీ S9 ప్లస్, రియల్ మి 3ప్రో, మోటరోలా వన్ విజన్, రెడ్ మి నోట్ 7S స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S9+ ఫోన్ పై డిస్కౌంట్ ధరతో రూ.34వేల 999కే ఆఫర్ చేస్తోంది. రియల్ మి 3ప్రో డిస్కౌంట్ ధరతో రూ.11వేల 999కే లభ్యం కానుంది. అంటే.. 2వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మోటరోలా వన్ విజన్ ఫోన్ రూ.5వేల తగ్గింపు ధరతో రూ.14వేల 999కే లభించనుంది. దీని అసలు ధర మార్కెట్లో రూ.19వేల 999గా ఉంది.
గ్రేడియంట్, సప్ హైర్ గ్రేడియంట్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. రెడ్ మి నోట్ 7S (4GB) తగ్గింపు ధరతో ఆఫర్ చేస్తోంది. ఎంత తగ్గింపు అనేది ఇంకా రివీల్ చేయలేదు. సెప్టెంబర్ 20 సేల్ ప్రారంభంలో ఫ్లిప్ కార్ట్ మొబైల్ డీల్స్ సహా ఇతర ఫ్లాగ్ షిప్ ఫోన్ల డీల్స్ పై ఆఫర్లు రిలీజ్ చేయనుంది. సెప్టెంబర్ 20 నుంచి ఈ కామర్స్ వెబ్ సైట్ అన్ని మొబైల్ డీల్స్ అన్ లాక్ చేయనుంది.
ఆపిల్, షియోమీ, రియల్ మి, ఒప్పో, వివో, గూగుల్, ఇన్ ఫైనిక్స్ బ్రాండ్లతో పాటు రెడ్ మి K20 ప్రో, రెడ్ మి 7A, రియల్ మి C2, అషూస్ 6z, ఒప్పో రెనో 2z, ఫిక్సల్ 3A, రెడ్ మి నోట్ 7 ప్రో, రియల్ మి 5, ఒప్పో F11 ప్రో స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరతో ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు 4 గంటల ముందే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 29 నుంచి సేల్ ప్రారంభం కానుంది. కానీ, మొబైల్ డీల్స్ మాత్రం సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా మల్టిపుల్ లోన్ ఆప్షన్లు ఆఫర్ చేస్తోంది. కార్డ్ లెస్ క్రెడిట్, ఫ్లిప్ కార్ట్ పేలేటర్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐలను ఆఫర్ చేస్తోంది.