Godrej Window AC : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌‌లో బిగ్ ఫ్లాట్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే గోద్రేజ్ విండో AC కొనేసుకోండి..!

Godrej Window AC : కొత్త ఏసీ కొంటున్నారా? గోద్రెజ్ విండో అద్భుతమైన ఫీచర్లతో ఎక్కువ సమయం కూలింగ్ అందించగలదు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఈ విండో ఏసీపై బిగ్ ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Godrej Window AC : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌‌లో బిగ్ ఫ్లాట్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే గోద్రేజ్ విండో AC కొనేసుకోండి..!

Flipkart Mega Saving Days Sale

Updated On : March 24, 2025 / 6:24 PM IST

Godrej Window AC : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో కూలింగ్ కోసం ఏసీలు లేదా కూలర్లు తప్పనిసరిగా మారాయి. ఏసీలను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఎండ వేడి నుంచి తట్టుకునేందు కొత్త ఏసీ కొనేందుకు చూస్తుంటే మాత్రం ఇదే సరైన సమయం.

Read Also : Income Tax Deadline : ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ITR ఫైలింగ్ ఎలా చేయాలి? ఏయే డాక్యుమెంట్స్ కావాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ప్రస్తుతం మార్కెట్లో గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ విండో AC లభ్యమవుతుంది. ఈ విండో ఏసీ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ AC కూలింగ్ కెపాసిటీ, పవర్ సేవింగ్, లాంగ్ టైఫ్ మన్నికను అందించేలా రూపొందింది. ఈ విండో ఏసీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అద్భుతమైన ఆఫర్‌లతో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్, ఆఫర్లు :
ఈ విండో ఏసీ ప్రస్తుతం రూ.29,344కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్‌లో 29శాతం ఆఫర్‌తో పాటు అదనపు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.

స్టైలిష్, డిజైన్ :
ఈ గోద్రేజ్ విండో ఏసీ అద్భుతమైన డిజైన్‌లో వస్తుంది. మీ గదిని మరింత కూల్‌గా ఉంచుతుంది. ఏసీ క్వాలిటీతో పాటు నిర్మాణం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికను అందించే అద్భుతమైన ఏసీగా చెప్పవచ్చు.

Read Also : Samsung Galaxy S24+ 5G : కిర్రాక్ ఆఫర్.. లక్ష ఖరీదైన శాంసంగ్ 5జీ ఫోన్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 57వేలకే.. డోంట్ మిస్..!

కూలింగ్ కెపాసిటీ, పర్ఫార్మెన్స్ :
ఈ 1.5 టన్ ఏసీ మీడియం సైజు గదులకు అనుకూలంగా ఉంటుంది. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ పవర్ సేవ్ చేస్తుంది. హై ఎయిర్ ప్రెజర్, ఫాస్ట్ కూలింగ్ అందించే టర్బో మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అద్భుతమైన పర్పార్మెన్స్, లో-మెయింట్‌‌నెన్స్ అందించే కాపర్ కండెన్సర్ కాయిల్‌ను కలిగి ఉంది.

స్మార్ట్ ఫీచర్లు :
నైట్ టైమ్ టెంపరేచర్ తగ్గించేందుకు స్లీప్ మోడ్ ఫీచర్‌ను కలిగి ఉంది. పవర్ పోయి వచ్చిన తర్వాత ఆటో-రీస్టార్ట్ ఫీచర్ అదే సెట్టింగ్‌లలో ఏసీ రీస్టార్ట్ అవుతుంది.