ఫోర్బ్స్: ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. దీంట్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. దీంట్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. దీంట్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం. రెండో స్థానంలో బిల్ గేట్స్, మూడో స్థానంలో వారెన్ బఫెట్ నిలవగా.. ముకేశ్ అంబానీ 13వ స్థానాన్ని సంపాదించుకున్నారు. 2018 సంవత్సరంతో పోలిస్తే..అంబానీ 6 స్థానాలు బెటర్ చేసుకోవటం విశేషం.ముకేశ్ అంబానీ సంపద 2018లో 4010 కోట్ల డాలర్లు. దాని నుంచి పెరిగి 5000 కోట్ల డాలర్లకు అంటే ఇండియన్ కరెన్సీ రూ.3.5 లక్షల కోట్లకు చేరింది.
Also Read : నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్
2017లో ముకేశ్ అంబానీ 37వ స్థానంలో ఉండగా..2018లో 19వ స్థానానికి తన ర్యాంకును మెరుగు పరుచుకున్నారు. 2019తో మరో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరారు. ప్రపంచ వ్యాప్తంగా కుబేరులతో ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. 2019 ఫిబ్రవరి చివరినాటికి ఉన్న మారకపు రేట్లు, షేర్ల ధరలు ఆధారంగా నికర సంపదను ఫోర్బ్స్ లెక్కించింది.
- అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి 2018 కంటే 1900 కోట్ల డాలర్లు మేర పెరిగి 13100 కోట్ల డాలర్ల (రూ. 9లక్షల కోట్లు) పైకి చేరింది.
- బిల్‌గేట్స్ సంపద 9000 కోట్ల డాలర్ల నుంచి 9650 కోట్ల డాలర్లకు చేరగా.. వారెన్ బఫెట్ సంపద 150 కోట్ల డాలర్లుపెరిగి 8250 కోట్ల డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సంపద 2018 తో పోలిస్తే 900 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ర్యాంకు 5 నుంచి 8కి పడిపోయింది.
- జాబితాలో మొదటి 100 ర్యాంకుల్లో నలుగురు భారతీయులు మాత్రమే చోటు దక్కించుకున్నారు. వాళ్లలో ముకేశ్ అంబానీ ముందువరుసలో నిలువగా.. మిగిలిన ముగ్గురు విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ (36వ ర్యాంకు), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (82 ర్యాంకు), అర్సెల్లర్ మిత్తల్, సీఈఓ లక్ష్మీ మిత్తల్ (91) దక్కించుకున్నారు.
- ఈసారి జాబితాలో మొత్తం 2,153 మంది కుబేరులకు ర్యాంకులు ఇచ్చారు. వీరి మొత్తం సంపద 8.7 లక్షల కోట్ల డాలర్లు. 2018 జాబితాలో 2,208 మంది కుబేరులు జాబితాలో చోటు దక్కించుకోగా.. వీరి మొత్తం సంపద 9.1 లక్షల కోట్లు.
- జాబితాలో చోటు దక్కించుకున్న కుబేరుల్లో 1,450 మంది స్వయం శక్తితో పైకి ఎదిగినవారని ఫోర్బ్స్ వెల్లడించింది.
Also Read : చంద్రుడు వద్దా : చైనా కృత్రిమ సూర్యుడు
ఫోర్బ్స్ శ్రీమంతుల లిస్ట్ లో నలుగురు తెలుగువారు
ఫోర్బ్స్ రూపొందించిన కుబేరుల జాబితాలో నలుగురు తెలుగువారికి చోటు లభించింది. దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళీ దివి 3.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో 645వ ర్యాంకు పొందారు. అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పి.వి.రామ్‌ప్రసాద్ రెడ్డికి 804వ ర్యాంకు లభించింది.
ఆయన నికర సంపద 2.8 బిలియన్ డాలర్లు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థాపకుడు పి.పి.రెడ్డి (1008 ర్యాంకు), ఎండీ పి.వి.కృష్ణారెడ్డి (1057 ర్యాంకు) కూడా జాబితాలో చోటు సంపాదించారు. వీరిద్దరి నికర సంపద వరుసగా 2.3 బిలియన్ డాలర్లు, 2.2 బిలియన్ డాలర్లు.
Also Read : వీరుడు స్ఫూర్తి : పాఠ్యాంశంలో ‘అభినందన్’