4 రీజన్స్ ఇవే: కెమెరా మార్కెట్ తగ్గుతోంది.. స్మార్ట్ ఫోన్లేనా?

  • Published By: sreehari ,Published On : December 12, 2019 / 03:20 PM IST
4 రీజన్స్ ఇవే: కెమెరా మార్కెట్ తగ్గుతోంది.. స్మార్ట్ ఫోన్లేనా?

Updated On : December 12, 2019 / 3:20 PM IST

ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లదే ట్రెండ్. దేశీయ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లు హైక్వాలిటీ కెమెరాలతో రిలీజ్ అవుతున్నాయి. ఫొటోగ్రాఫర్లతో మెరిసే కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. ఏదో ఫంక్షన్లలో లేదా ఈవెంట్లలో మాత్రమే కనిపించే కెమెరాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు పెద్ద కెమెరాలపై ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కనిపించే ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధించేవారు. రానురాను కెమెరాల వాడకం తగ్గిపోతోంది.

స్మార్ట్ ఫోన్ల వాడకమే ఇందుకు కారణమా? కాదనే అంటున్నారు ఫొటోగ్రాఫర్.. ఓకేషనల్ ఫీటా ఫిక్సల్ గెస్ట్ రచయిత రాబిన్ వోంగ్. హైమెగాఫిక్సల్ కెమెరాలతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాక.. కెమెరాలకు గిరాకీ తగ్గిందా? అంటే ఆయన కాదంటున్నారు. స్మార్ట్ ఫోన్ల ప్రభావంతోనే కెమెరాలను కొనేవారి సంఖ్య తగ్గిపోయిందంటే అందులో ఏమాత్రం నిజం లేదని రాబిన్ కొట్టిపారేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లతో గ్రేట్ కెమెరాలతో నడిచే ఇమేజింగ్ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు. మరి ఎందుకు కెమెరా మార్కెట్ తగ్గిపోతోందంటే ఇందుకు ఆయన 4 కారణాలను వెల్లడించారు.

కెమెరాలెప్పుడో శిఖరాన్ని చేరాయి :
ఫొటోగ్రాఫీలతో కెమెరాల ట్రెండ్.. ఎప్పుడో అత్యంత ఎత్తైనా శిఖరాన్ని చేరాయినడంలో సందేహం లేదు. ఏళ్ల క్రితమే తగినంత స్థాయిలో కెమెరాల మార్కెట్ విస్తరించింది. ఐదేళ్ల క్రితం మార్కెట్లో రిలీజ్ అయిన ఏదైనా కెమెరా కావొచ్చు.. ఎన్నో ఏళ్లుగా ఫొటోగ్రఫీకి ప్రాణం పోశాయి. అద్భుతమైన ఫిక్చర్ క్వాలిటీని అందించడంలో కెమెరాలకు సాటి మరొకటి లేదని చెప్పాలి. కానీ, కెమెరాల మార్కెట్ క్షీణించడానికి ఫొటోగ్రఫీ కోసం వాడేవారు మాత్రమే కొనుగోలు చేయడం లేదా అత్యంత ఖరీదైనదివి ఉండటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు.

ఫొటోగ్రఫీపై ఆసక్తి తగ్గడం :
ప్రస్తుత రోజుల్లో చాలామందిలో ఫొటోగ్రఫీపై ఆసక్తి తగ్గిపోతోంది. కెమెరాలు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫొటోగ్రఫీపై అమితమైన ఇష్టం ఉన్నవారు ఒకప్పుడు ముందుగా బయట రియల్ కెమెరా కొనేందుకు ఇష్టపడతారు. కానీ, తక్కువగా చాలామంది ఫొటోగ్రఫీ ప్రయత్నించేవారు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఫొటోగ్రఫీ కోసం మరో కొత్త కెమెరా కొనాలనుకోవడం లేదు. దీనికి కారణం.. ఫొటోగ్రఫీపై నిజంగా ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఫొటోగ్రఫీ గతిని మార్చేసిన సోషల్ మీడియా:
ఫొటోగ్రఫీని ప్రతిఒక్కరూ తమ సెల్ఫ్ డాక్యుమెంటేషన్ కోసం ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియా ప్రభంజనంతో ఫొటోగ్రఫీపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా మంది వినియోగదారులు తీయాలనుకునే ఫోటోల కోసం సోషల్ మీడియా సరైన కెమెరాలను తక్కువ అవసరం చేసింది. వాంగ్ చెప్పినట్లుగా..  “మీ సెల్ఫీల కోసం మీకు 61MP కెమెరా అవసరం లేదు. ఆ కేక్ ముక్కను బంధించడానికి మీకు ISO100,000 అవసరం లేదు. కాళ్లను నాకుతున్న మీ పిల్లిని స్నాప్ తీయడానికి మీకు ఖచ్చితంగా సూపర్-టెలిఫోటో లెన్స్ అవసరం లేదు’ అని చెప్పారు.

నిశ్చల స్థితిలో ఫోటోగ్రఫీ: ప్రేరణ అవసరం
వాంగ్ ప్రకారం.. ఆధునిక ఫోటోగ్రాఫర్‌లలో ఎక్కువమంది కొత్తగా ఏది సురక్షితమైనదో అదే చేసేందుకు ఇష్టపడుతున్నారు. వీడియో “నేటి ఫోటోగ్రాఫర్ల పని నిజంగా రెచ్చగొట్టేది లేదా విప్లవాత్మకమైనదిగా భావించలేదని అంటున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? మార్కెట్‌ను “సేవ్” చేయడంలో సాయపడేందుకు ఎక్కువ మంది వ్యక్తులు లేరు. కానీ ఫోటోగ్రఫీని ఆసక్తికరంగా మిగతా ప్రపంచానికి మరోసారి ఉత్తేజపరిచే ప్రయత్నం చేసేలా ఫోటోగ్రాఫర్‌లను ప్రోత్సహించాలని వాంగ్ తెలిపాడు.

‘మిమ్మల్ని మెరుగుపరుచుకోండి. మంచి ఫోటోగ్రాఫర్‌లుగా ఉండండి. మీరు నిజాయితీగా ఉండండి, అప్పుడు ఇతరులు మనల్ని అనుసరించడానికి ప్రేరణగా ఉంటాము” అని వాంగ్ తెలిపారు.”నేను మీతోనే ఉన్నాను. ఫోటోగ్రఫీ అంటే నిజమైన అర్ధాన్ని ఈ ప్రపంచానికి చాటి చెబుదాం’ అన్నారు. ఫొటోగ్రఫీని.. ప్రతిఒక్క ఫొటోగ్రాఫర్ తనకు తాను ప్రేరేపించుకున్నప్పుడే అందరిలో ఆసక్తిని రేకిత్తించవచ్చు.