Gold Prices: బంగారం ధరల్లో కీలక మార్పులు.. హైదరాబాద్, విజయవాడలో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు ఎంతో తెలుసా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ...

gold
Gold and silver Price: భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. శుభకార్యాలు, పండుగలు, ఇతర పర్వదినాల్లో బంగారం కొనుగోళ్లపై మక్కువ చూపుతుంటారు. గత కొన్నిరోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం కూడా బంగారం ధర పెరిగింది. అయితే, వెండి ధర తగ్గింది.
బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 110 పెరగ్గా, 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 100 పెరిగింది. వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఔన్స్ గోల్డ్ 2,911 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఔన్స్ సిల్వర్ రేటు 32.55 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.80,500 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,820కు చేరింది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,650 కాగా.. 24 క్యారట్ల ధర రూ.87,970.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 80,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.87,820 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000గా నమోదైంది.