Gold Rate: వాళ్ల కొట్లాటతో బంగారం బెంబేలెత్తిస్తోంది.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ గోల్డ్ రేటు ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.

Gold Rate
Gold And Silver Price: బంగారం ధరలు రోజురోజుకు రయ్ రయ్ మంటూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అయితే, ఈ బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తుండటానికి ఆ ఇద్దరు దేశాధినేతలే కారణంగా ఎనలిస్టులు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు ఒకరికి మించి ఒకరు ప్రతీకార సుంకాలను పెంచుకుంటూ పోతుండటంతో ఆసియా, అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. అయితే, కాస్త ఊరటనిచ్చాయనే చెప్పొచ్చు.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ.270 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 250 పెరిగింది. మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. అయితే, ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు రూ. 2వేలు, రూ.3వేల పెరుగుతూ పోయాయి. శనివారం మాత్రం గోల్డ్ రేటు దూకుడు కాస్త తగ్గింది. రూ. 270 మాత్రమే పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర అంతర్జాతీయ విపణిలో శుక్రవారం ఉదయం 3,208 డాలర్ల వద్ద ట్రేడవగా.. శనివారం ఉదయం 3,238 డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఔన్స్ సిల్వర్ ధర స్వల్పంగా పెరిగి 32.17 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.87,700 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,670కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,850 కాగా.. 24 క్యారట్ల ధర రూ.95,820కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 87,700 కాగా.. 24క్యారెట్ల ధర రూ.95,670 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000 కు చేరింది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.