Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి..! కారణాలు ఇవే..
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ పై..

Gold
Gold Rate: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తత వాతావరణం సర్దుమణిగింది. దీంతో పెట్టుబడిదారులు కంపర్ట్ జోన్ నుంచి ఈక్విటీ వైపు పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. దీంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2,130 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 1,950 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం ఔన్సు (31.10గ్రాముల) 40డాలర్లు తగ్గి 3,147డాలర్లకు చేరింది. వెండి సైతం 31.91 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. అయితే, ఈ నెలాఖరు వరకు గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.86,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.93,930 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.94,080కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 86,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ.93,930కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.96,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,08,000 వద్ద కొనసాగుతుంది.