Gold Price : బంగారం ధరల్లో భారీ మార్పు.. తులం గోల్డ్‌పై రూ.3,500.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర (Gold Price) లో

Gold Price : బంగారం ధరల్లో భారీ మార్పు.. తులం గోల్డ్‌పై రూ.3,500.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇవే..

gold price

Updated On : August 31, 2025 / 7:12 AM IST

Gold Price : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. గడిచిన వారం రోజుల్లో బంగారం ధర (Gold Price) సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో బంగారం ధరలుసైతం అమాంతం పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు గోల్డ్ రేటులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ వారం రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 3,500 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. ఆదివారం ఉదయం ఔన్స్ గోల్డ్ పై 33 డాలర్లు పెరిగింది. ఫలితంగా అక్కడ ఔన్సు గోల్డ్ 3,447 డాలర్ల వద్ద కొనసాగుతుంది. డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావంతోపాటు.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.96,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,04,950 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,05,100 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.96,200 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,04,950కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,31,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,21,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,31,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.